- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాన్-ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగింపు!
న్యూఢిల్లీ: శాశ్వత ఖాతా సంఖ్య(పాన్)ని ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు గడువును ఈ ఏడాది జూన్ 30కి పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నిర్ణయం తీసుకుంది. దాంతో పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసేందుకు సీబీడీటీ ఐదోసారి గడువును పొడిగించింది. మంగళవారం విడుదల నోటిఫికేషన్ ప్రకారం, పన్ను చెల్లింపుదారులకు మరికొంత సమయం ఇవ్వాలని భావించాం. అందుకోసం పాన్, ఆధార్ అనుసంధానం గడువును జూన్ 30 వరకు పొడిగించడం జరిగింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొనకుండా పాన్-ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చని వివరించింది.
జులై 1వ తేదీ నుంచి అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు పనిచేయదు. ఆ తర్వాత 30 రోజుల్లోగా రూ. 1000 చెల్లించిన తర్వాత నిర్ణీత అధికారికి ఆధార్ వివరాలు తెలియజేసి తిరిగి పాన్‌ను ఆపరేట్ చేయవచ్చని తెలిపింది. కాగా, ఆదాయ పన్ను రిటర్నులను ఫైల్ చేసేందుకు పన్ను చెల్లింపుదారులు తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయడం తప్పనిసరి. గతంలో పలుమార్లు గడువు పొడిగించిన తర్వాత ప్రభుత్వం ఈ నెల 31కి ఆఖరి గడువుగా నిర్ణయించింది. తాజాగా దీన్ని మరో నెల రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read...