- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ITR Filing: 7 కోట్లు దాటిన ఐటీఆర్ ఫైలింగ్‌లు: ఐటీ శాఖ
దిశ, బిజినెస్ బ్యూరో: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించి బుధవారం ఆఖరు కావడంతో పన్ను చెల్లింపుదారులు భారీగా ఫైలింగ్ ప్రక్రియకు మొగ్గు చూపారు. జూలై 31న సాయంత్రం 7 గంటల వరకు 2023-24 మదింపు సంవత్సరానికి సంబంధించి ఏకంగా 7 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఆఖరు రోజు కావడంతో బుధవారం ఒక్కరోజే 50 లక్షల మంది తమ రిటర్నులను దాఖలు చేశారని ఐటీ శాఖ పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 8.61 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గడువు ముగుస్తున్న కారణంగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉండటంతో అందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఐటీ శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఐటీఆర్ ఫైలింగ్, పన్ను చెల్లింపులు, ఇతర సేవలకు సంబంధించి సహాయం కోసం హెల్ప్‌డెస్క్, లైవ్ చాట్, సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నామని అధికారులు వెల్లడించారు. అయితే, వివిధ కారణాలతో రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపు ఉంటుందని ఆశించిన పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం విషాదం.