ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6 శాతం!

by Harish |
ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6 శాతం!
X

న్యూఢిల్లీ: దేశంలో కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల ఉత్పత్తి వృద్ధి ఫిబ్రవరిలో 6 శాతం పెరిగింది. ముడి చమురు మినహా అన్ని రంగాలు సానుకూల వృద్ధిని సాధించడంతో గతేడాది కంటే 2023, ఫిబ్రవరిలో ఎనిమిది మౌలిక రంగాల ఉత్పత్తి పుంజుకుంది. శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం.. ఎరువుల ఉత్పత్తి అత్యధికంగా 22.2 శాతం, బొగ్గు ఉత్పత్తి 8.5 శాతం, విద్యుదుత్పత్తి 7.6 శాతం, సిమెంట్ 7.3 శాతం, ఉక్కు ఉత్పత్తి 6.9 శాతం వృద్ధి చెందాయి. రిఫైనరీ ఉత్పత్తులు ఉత్పత్తి 3.3 శాతం, సహజ వాయువు 3.2 శాతం పెరిగాయి. ముడి చమురు ఉత్పత్తి మాత్రమే సమీక్షించిన నెలలో 4.9 శాతం క్షీణించిందని గణాంకాలు పేర్కొన్నాయి.

Advertisement

Next Story