- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలి భారత ఉద్యోగిని నియమించిన ఓపెన్ఏఐ
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఛాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐ భారత్‌లో నియామకాలు ప్రారంభించింది. తాజాగా కంపెనీలో తొలి భారత ఉద్యోగిగా ప్రగ్యా మిశ్రాను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశీయంగా కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రభుత్వ సంబంధాల విభాగానికి హెడ్‌గా ప్రగ్యా మిశ్రాకు కంపెనీ బాధ్యతలు అప్పగించింది. ప్రగ్యా మిశ్రా ఇదివరకు ట్రూకాలర్ ప్రభుత్వ సంబంధాల విభాగానికి హెడ్‌గా చేశారు. దానికి ముందు మెసేంజర్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌లో ఆమె బాధ్యతను నిర్వహించారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ అన్నికలు జరుగుతున్న వేళ ఓపెన్ఏఐ నియామకాలు ప్రారంభించడం విశేషం. ఈ నెలాఖరులోగా రగ్యా మిశ్రా ఓపెన్ఏఐలో తన విధులను ప్రారంభిస్తారని భావిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ చర్య వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ టెక్నాలజీ కోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు నిబంధనల విషయమై పరిశీలిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలతో పరస్పర సహకారానికి ఓపెన్ఏఐకి ఉన్న నిబద్ధతను సూచిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది. కాగా, గతేడాది ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ భారత ప్రధాని మోడీని కలిసిన సంగతి తెలిసిందే.