ఇంటర్నెట్ లేకుండా ఆన్‌లైన్ చెల్లింపులు ఎలాగంటే..!

by Dishaweb |
ఇంటర్నెట్ లేకుండా ఆన్‌లైన్ చెల్లింపులు ఎలాగంటే..!
X

హైదరాబాద్: డిజిటల్ చెల్లింపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా సాధారణ విషయంగా మారింది. కరోనా మహమ్మారి తర్వాత ఆన్‌లైన్‌లో చెల్లింపులు, లావాదేవీలు మరింత చేరువగా వచ్చేశాయి. చాలా తక్కువ మొత్తం నుంచే యూపీఐ విధానంలో చెల్లింపులు చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. అయితే, ఆన్‌లైన్ చెల్లింపులు, లావాదేవీల నిర్వహణకు ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండాలి. బ్యాంకు, యూపీఐ అకౌంట్లలో నగదు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ లేకపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు. దీనికి పరిష్కారంగానే ఇంటర్నెట్ లేకపోయినా చెల్లింపులు చేసే విధానం అందుబాటులో ఉంది. మొబైల్‌ఫోన్‌లో చిన్న సెట్టింగ్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం లేని సందర్భాల్లో సైతం యూపీఐ ద్వారా చెల్లింపులు, లావాదేవీల నిర్వహణకు అవకాశం ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం..!

*99#..

*99# మొబైల్ బ్యాంకింగ్ సేవలకు మెరుగైన పరిష్కారం. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా ఈ నంబర్‌ ద్వారా డబ్బు పంపడానికి, యూపీఐ పిన్ నంబర్ మార్చడానికి, అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకునేందుకు వీలుంటుంది. దేశవ్యాప్తంగా ఈ సేవ అందుబాటులో ఉంది. *99# సేవలను దేశంలో 83 ప్రధాన బ్యాంకులు అందిస్తున్నాయి. నాలుగు టెలికాం కంపెనీలు కూడా ఈ సేవలందిస్తున్నాయి. అలాగే, ఇంగ్లిష్, హిందీ సహా 13 దేశీయ భాషల్లో అందుబాటులో ఉంది.

సెట్ చేసుకునే విధానం..

ఆఫ్‌లైన్‌లో యూపీఐ చెల్లింపుల కోసం మొబైల్‌ఫోన్‌లో *99# నంబర్‌కు డయ్ల్ చేయాలి. ఆ తర్వాత వచ్చే ఆప్షన్స్ ద్వారా భాషను ఎంచుకుని, బ్యాంకు పేరును ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్‌కు అనుసంధానం చేసిన బ్యాంకు అకౌంట్ల జాబితా వస్తుంది. అందులో కావాల్సిన బ్యాంకు అకౌంట్‌ను ఎంపిక చేసి, సదరు బ్యాంకు డెబిట్ కార్డు ఎక్స్‌పైరీ తేదీ, కార్డుపై ఉండే చివరి ఆరు నంబర్లను ఎంటర్ చేయాలి. ఇక ఆఫ్‌లైన్‌లో యూపీఐ చెల్లింపులు చేసుకోవడం.

లావాదేవీ ఎలా చేయాలంటే..

ఇంటర్నెట్ లేని సందర్భాల్లో నగదు పంపించేందుకు మొబైల్‌లో అదే *99# నంబర్‌కు డయల్ చేసి 1 నంబర్ నొక్కాలి. అనంతరం డబ్బు పంపాల్సిన వ్యక్తి ఫోన్ నంబర్, యూపీఐ ఐడీ, బ్యాంకు అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఎంత మొత్తం పంపాలో ఎంచుకుని, యూపీఐ పిన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఈ విధానంలో ఒకసారి రూ. 5,000 వరకు నగదు పంపించవచ్చు. ఈ సేవలు వినియోగించినందుకు ప్రతి లావాదేవీకి 50 పైసలు ఛార్జీ వర్తిస్తుందని గుర్తించుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed