One Plus Diwali Sale: వన్‌ప్లస్‌ దీపావళి ప్రత్యేక సేల్.. ఈ ప్రొడక్ట్ లపైన అదిరిపోయే ఆఫర్లు

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-26 12:04:20.0  )
One Plus Diwali Sale: వన్‌ప్లస్‌ దీపావళి ప్రత్యేక సేల్.. ఈ ప్రొడక్ట్ లపైన అదిరిపోయే ఆఫర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌(One plus) దీపావళి పండగ(Diwali Festival) వేళ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా 'మేక్ ఇట్ స్పెషల్(Make It Special)' పేరుతో సేల్ ప్రారంభించింది. ఈ సేల్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 5 వరకు ఈ సేల్ కొనసాగుతుందని తెలిపింది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ లపైన ఆ సంస్థ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. వన్‌ప్లస్‌ వెబ్‌సైట్ తో పాటు, వన్‌ప్లస్‌ స్టోర్, అమెజాన్(Amazon)లో ఈ ఆఫర్లు పొందవచ్చని తెలిపింది. ఆఫ్ లైన్ లో అయితే రిలయన్స్ డిజిటల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, క్రోమా తదితర స్టోర్లలో కూడా ఈ సేల్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

అయితే ఈ సేల్ లో ముఖ్యంగా వన్‌ప్లస్‌ నార్డ్ 4 ఫోన్(OnePlus Nord 4 phone)పై రూ. 4 వేల డిస్కౌంట్(Discount)ను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో ఈ ఫోన్ ధర రూ. 29,999 గా ఉంది. అయితే రూ. 2,000 బ్యాంకు డిస్కౌంట్ తో కలిపి ఈ ఆఫర్లో రూ. 25,999 కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ(No Cost EMI) ఆప్షన్ కూడ ఉంది. ఇక రూ. 24,999 విలువైన వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 4(OnePlus Nord CE 4) ఫోన్ రూ. 20,999కే లభిస్తోంది. వన్‌ప్లస్‌ 12 ఆర్(One Plus 12R) మొబైల్ రూ. 32,999కే యూజర్లు సొంతం చేసుకోవచ్చు. ఇక ఎయిర్ బడ్స్(Air Buds) విషయానికొస్తే.. వన్‌ప్లస్‌ నార్డ్ బడ్స్ 3(OnePlus Nord Buds 3), వన్‌ప్లస్‌ నార్డ్ బడ్స్ 3 ప్రో(OnePlus Nord Buds 3 Pro) ను రూ. 2,099, రూ. 2,499 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే వన్‌ప్లస్‌ వాచ్ 2ఆర్(One Plus Watch 2R) రూ. 12,999కే లభిస్తోంది. ఇవేగాక ఇతర ప్రొడక్టులపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed