- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగులకు నోటీసుల అంశంపై స్పందించిన టీసీఎస్!
న్యూఢిల్లీ: ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించే క్రమంలో దేశీయ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ కొత్త నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వారంలో మూడు రోజుల పాటు ఉద్యోగులు ఆఫీసులకు రావాలని తెలిపింది. అయితే, రిటర్న్-టూ-ఆఫీస్ పాలసీ పాటించని ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసినట్లు వచ్చిన వార్తలను ఖండించింది.
ఉద్యోగులందరూ ఆఫీస్ వాతావరణానికి అలవాటు పడటానికే రిటర్న్-టూ-ఆఫీస్ పాలసీ తెచ్చామని, అందుకోసం ఉద్యోగులు నెలకు 12 రోజులు ఆఫీసులో పనిచేసేలా నిబంధనలు రూపొందించామని గురువారం ప్రకటనలో వివరించింది. అంతేకాని ఆ నిబంధనను పాటించని ఉద్యోగులకు మెమోలు ఇస్తున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని కంపెనీ స్పష్టం చేసింది.-
గత రెండేళ్ల కాలంలో సంస్థలో చాలా మంది కొత్తవారు చేరారు. కరోనా కారణంగా వారిలో ఎక్కువమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇటీవల పరిస్థితులు మెరుగుపడటంతో వారిని ఆఫీస్ వాతావరణానికి అలవాటు పడటం, సీనియర్ ఉద్యోగుల సహకారం పొందడం, సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వారంలో మూడు రోజులు ఆఫీసులకు రావాలని చెప్పాం. కొంతమంది ఉద్యోగులకు క్రమశిక్షణ చర్యల కారణంగా మెమోలు ఇచ్చింది నిజమే కానీ ఆఫీసులకు రాని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కంపెనీ పేర్కొంది.