- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 2 వేల నోట్ల సర్క్యులేషన్‌పై ఆర్థిక మంత్రి స్పష్టత!
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా రూ. 2 వేల నోటు లభ్యత తగ్గిపోయిన సంగతి తెలిసిందే. వివిధ కారణాలతో ఉద్దేశపూర్వకంగా 2 వేల నోటు సర్క్యులేషన్‌ను తగ్గించారనే వార్తలపై కేంద్రం స్పందించింది. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో దీనిపై స్పష్టత ఇచ్చారు. ఏటీఎం సెంటర్లలో రూ. 2 వేల నోట్లు నింపకూడదనేలా బ్యాంకులు ఎలాంటి సూచనలు ఇవ్వలేదని తెలియజేశారు. ఏటీఎంలలో నగదు నింపే విషయంలో బ్యాంకులదే సొంత నిర్ణయమని, వినియోగదారుల అవసరం, సందర్భానుసారం బ్యాంకులే అంచనా కట్టి ఆయా నోట్లను నింపుతాయని చెప్పారు.
బ్యాంకులకు రూ. 2 వేల నోట్లను నింపాలని గానీ, వద్దని గానీ సూచనలేమీ కేంద్రం ఇవ్వలేదని లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) వార్షిక డేటా ప్రకారం, 2017, మార్చి నాటికి సర్క్యులేషన్‌లో ఉన్న రూ. 500, రూ. 2,000 నోట్ల విలువ రూ. 9.5 లక్షల కోట్లు కాగా, 2022, మార్చి నాటికి అది రూ. 27 లక్షల కోట్లకు చేరుకుందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇక, కేంద్రం రుణాలకు సంబంధించిన ప్రశ్నకు జవాబిచ్చిన ఆర్థిక మంత్రి, 2023, మార్చి 31 నాటికి కేంద్రం అప్పులు దాదాపు రూ. 156 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇది దేశ జీడీపీలో 57.3 శాతం ఉండొచ్చని పేర్కొన్నారు.