బిట్స్ పిలానీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన ఆర్థిక మంత్రి.. ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణం

by Harish |   ( Updated:2024-02-24 14:39:27.0  )
బిట్స్ పిలానీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన ఆర్థిక మంత్రి.. ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముంబైలోని కళ్యాణ్‌లో బిర్లా గ్రూప్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంజినీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ బిట్స్‌ పిలానీ ఐదవ క్యాంపస్‌ను ప్రారంభించారు. 60 ఎకరాల్లో రూ.1,600 కోట్లతో నిర్మించిన క్యాంపస్‌లో మొత్తం 5,000 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తామని గ్రూప్ చైర్మన్, ఇన్‌స్టిట్యూట్ చాన్సలర్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, 2014 నుండి, ప్రతి సంవత్సరం ఒక కొత్త IIT/IIM ప్రారంభమయింది. అలాగే, ప్రతి వారం దేశంలో ఒక కొత్త విశ్వవిద్యాలయం నిర్మించారు, ప్రతి మూడు రోజులకు ఒక అటల్ టింకరింగ్ ల్యాబ్ ఓపెన్ అవుతుంది, ప్రతి రెండవ రోజు ఒక కొత్త కళాశాల నిర్మించబడుతుంది, ప్రతి రోజు ఒక కొత్త ITI స్కిల్ ఇండియా మిషన్ కింద 1.4 కోట్ల మంది యువత శిక్షణ పొందారని సీతారామన్ శనివారం తెలిపారు. అలాగే, ఈ ఇన్‌స్టిట్యూట్ 7,300 మంది ఫార్చ్యూన్ 500 మంది సీఈఓలను, 300 మంది విద్యావేత్తలను, 600 మంది పౌర సేవకులను తయారు చేసిందని ఆమె అన్నారు.

శనివారం నిర్మలా సీతారామన్ ముంబై లోకల్ ట్రైన్‌ ఎక్కారు. ఘట్‌కోపర్ నుండి కళ్యాణ్‌ మార్గంలో ఆమె లోకల్ రైలులో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమెతో పులువరు సెల్ఫీలు దిగారు. ప్రయాణికులతో కూర్చొని వారితో సెల్ఫీలు దిగిన ఫొటోలను ఆమె కార్యాలయం షేర్ చేసింది.



Advertisement

Next Story

Most Viewed