గో ఫస్ట్ దివాలా ప్రక్రియ పిటిషన్‌ను అంగీకరించిన ఎన్‌సీఎల్‌టీ..!

by Mahesh |   ( Updated:2023-05-10 12:02:36.0  )
గో ఫస్ట్ దివాలా ప్రక్రియ పిటిషన్‌ను అంగీకరించిన ఎన్‌సీఎల్‌టీ..!
X

న్యూఢిల్లీ: బడ్జెట్ క్యారియర్ గో ఫస్ట్ ఇటీవల దాఖలు చేసిన స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ పిటిషిన్‌ను నేషనల్ కంపెనీ లాల్ ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) అంగీకరించింది. అలాగే, అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీ దివాలా పరిష్కారం కోసం రిజల్యూషన్ ప్రొఫెషనల్(ఐఆర్‌పీ)గా అభిలాష్ లాల్‌ను గో ఫస్ట్ నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు జస్టిస్ రామలింగం సుధాకర్, జస్టిస్ ఎల్ ఎన్ గుప్తా ఆధ్వర్యంలోని బెంచ్ ఆదేశాలిచ్చింది. ఈ నల 4న దివాలా పిటిషన్‌పై విచారణను జరిపిన ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలను రిజర్వ్ చేసింది. అయితే, తొందరగా విచారణ జరపాలన్న విజ్ఞప్తి నేపథ్యంలో బుధవారం తీర్పు ఇచ్చింది. గో ఫస్ట్ చేయాల్సిన చెల్లింపులపై మారటోరియం విధిస్తూ, డైరెక్టర్ల బోర్డును రద్దు చేసింది.

అంతేకాకుండా దివాలా పరిష్కార ప్రక్రియలో ఐఆర్‌పీకి సహకారం అందించాలని, ఈ సమయంలో ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించవద్దని స్పష్టం చేసింది. ఎన్‌సీఎల్‌టీ తీర్పును స్వాగతించిన గో ఫస్ట్ సీఈఓ కౌశిక్ కొనా, ఇది కీలక పరిణామమని అభిప్రాయపడ్డారు. కాగా, అమెరికాకు చెందిన ప్రాట్ అండ్ విట్నీ సంస్థ సరైన సమయానికి ఇంజిన్‌లను సరఫరా చేయకపోవడంతో తమ విమానాలు నిలిపివేయాల్సి వచ్చిందని, దానివల్లే సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు కంపెనీ ఇటీవల ప్రకటించింది. ఇప్పటికే కార్యకలాపాలు నిలిపేసింది. డీజీసీఏ సైతం తదుపరి ఆదేశాలు వచ్చేవరకు టికెట్ల అమ్మకాలు నిలిపేయాలని స్పష్టం చేసింది.

Also Read...

ఆఖరి గంట కొనుగోళ్లతో లాభాల్లోకి మారిన మార్కెట్లు!

Advertisement

Next Story