Myntra: క్విక్ కామర్స్ విభాగంలోకి మింత్రా.. 30 నిమిషాల్లో డెలివరీ

by S Gopi |
Myntra: క్విక్ కామర్స్ విభాగంలోకి మింత్రా.. 30 నిమిషాల్లో డెలివరీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఈ-కామర్స్ కంపెనీలు మింత్రా కొత్తగా క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించింది. 'ఎం-నౌ' పేరుతో కేవలం 30 నిమిషాల్లో డెలివరీ అందించనున్నట్టు గురువారం అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికి బెంగుళూరులో మాత్రమే క్విక్ కామర్స్ కార్యకలాపాలు అందుబాటులో ఉంటాయని, రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా మెట్రో, నాన్-మెట్రో నగరాలకు విస్తరించడానికి సిద్ధంగా ఉన్నామని మింత్రా సీఈఓ నందితా సిన్హా తెలిపారు. ఎం-నౌ ద్వారా క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ బ్రాండ్‌గా నిలుస్తామని సిన్హా చెప్పారు. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ ఆధారంగా అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లను దాదాపు 30 నిమిషాల్లోనే అందించాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నామన్నారు. ఫ్యాషన్, బ్యూటీ, యాక్సెసరీస్, హోమ్ ప్రోడక్ట్స్‌కు సంబంధించి 10 వేల కంటే ఎక్కువ ఉత్పత్తులను అందిస్తున్నాం. ఎం-నౌ ద్వారా వచ్చే 3-4 నెలల్లో లక్ష కంటే ఎక్కువ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతామని నందితా సిన్హా వివరించారు.

Next Story

Most Viewed