- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GDP: పెట్టుబడులు, అవకాశాలకు 'స్వీట్ స్పాట్'గా భారత్: మూడీస్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధిని 7.2 శాతానికి పెంచుతూ మూడీస్ అంచనాలను సవరించింది. ఇదివరకు మూడీస్ రేటింగ్స్ దేశ జీడీపీ వృద్ధిని 6.6 శాతంగా అభిప్రాయపడింది. స్థిరమైన వృద్ధి, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం ద్వారా ఈ వృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఇంధన, ఆహార సంక్షోభం, అధిక ద్రవ్యోల్బణం, వాణిజ్య విధానాలు, సరఫరా వంటి అడ్డంకుల నుంచి గ్లోబల్ ఎకానమీ స్థిరంగా రాణించింది. ముఖ్యంగా ఈ పరిస్థితుల నుంచి భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువ ప్రయోజనాలు పొందాయని మూడీస్ అభిప్రాయపడింది. ప్రధానంగా బలమైన వృద్ధి, స్థిరమైన ద్రవ్యోల్బణ కట్టడి ద్వారా భారత ఆర్థికవ్యవస్థ పెట్టుబడులకు, అవకాశాలకు 'స్వీట్ స్పాట్'గా మారిందని పేర్కొంది. దేశంలో వినియోగం, పెట్టుబడులు, ఉత్పాదక కార్యకలాపాల కారణంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వాస్త జీడీపీ 6.7 శాతానికి చేరుతుందని మూడీస్ తెలిపింది. భారత్‌తో పాటు చాలా జీ-20 దేశాలు స్థిరమైన వృద్ధి చూడనున్నాయి. దేశీయంగా రానున్న రోజుల్లో వినియోగం పెరగనుందని, పండుగ సీజన్, మెరుగైన వ్యవసాయ రంగ కార్యకలాపాలతో గ్రామీణ ప్రాంతంలో డిమాండ్ పుంజుకుంటోందని మీడీస్ పేర్కొంది.