- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ. 3 వేలకే వాషింగ్ మెషీన్.. బ్యాచిలర్స్‌కు బెస్ట్ చాయిస్
దిశ, వెబ్‌డెస్క్: బట్టలు ఉతకడం అంటే పెద్ద పని. ఉద్యోగస్తులు, విద్యార్థులు మొదలగువారికి ఆదివారం వచ్చిందంటే చాలు బట్టలు ఉతకడమే పనిగా పెట్టుకుంటారు. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంది. నీళ్లు, సర్ఫ్ వేస్తే చాలా దానికదే ఉతికి, ఆరేసి ఇస్తుంది. అయితే వాషింగ్ మెషిన్ అంటే పెద్ద పరిమాణంలో ఎక్కువ ధరలో ఉంటుంది. పట్టణాల్లో బ్యాచిలర్స్ కానీ, విద్యార్థులకు కానీ ఈ టైప్ వాషింగ్ మెషిన్స్ సెట్ కావు. దీంతో వారిని దృష్టిలో ఉంచుకుని ఇటీవల కొత్తగా మార్కెట్లోకి లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న పరిమాణంలో వాషింగ్ మెషిన్ ఒకటి అందుబాటులోకి వచ్చింది.
దీనిని ‘ఫోల్డబుల్ వాషింగ్ మెషీన్’ అని అంటారు. కంపెనీ పేరు ‘Octra’. దీని ఎత్తు 15-అంగుళాలు. అయితే దీన్ని ఏడు అంగుళాల వరకు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్. దీని బాడీ మొత్తం ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది. బరువు కూడా తక్కువగా ఉంటుంది. కెపాసిటీ 2 కిలోలు. సాక్స్, టీ-షర్టులు, టవల్స్, లోదుస్తులు, పిల్లల బట్టలు ఉతకడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. బట్టలు, సరిపడ వాటర్‌ను పోసి టైమ్ సెట్ చేసుకుంటే దానికదే బట్టల్ని వాష్ చేస్తుంది.
పట్టణాల్లో నివసించే స్టూడెంట్స్, బ్యాచిలర్స్, ఒంటరిగా నివసిస్తున్న వారికి ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీని బరువు, సైజు తక్కువగా ఉండటంతో ఇతర ప్రాంతాలకు పర్యటనలు చేసే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పోర్టబుల్ Octra మినీ ఫోల్డింగ్ వాషింగ్ మెషీన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 2,999.
Also Read..