- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Micromax: పునరుత్పాదక రంగంలోకి అడుగుపెట్టిన మైక్రోమ్యాక్స్

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. 'స్టార్టప్ ఎనర్జీ' పేరుతో పునరుత్పాదక ఇంధన వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు బుధవారం ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త కంపెనీ దేశీయంగా సోలార్ ప్యానెళ్లను తయారు చేస్తుందని, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ క్లీన్ ఎనర్జీ మిషన్‌కు మద్దతుగా పునరుత్పాదక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో పని చేయనున్నట్టు అధికారిక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా కూడా అనేక దేశాలు క్లీన్ ఎనర్జీ దిశగా అడుగులు పెడుతున్న తరుణంలో దేశీయంగా ఈ విభాగంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నామని, గృహ, వాణిజ్య. పారిశ్రామిక అవసరాల కోసం అధిక-సామర్థ్య సోలార్ ప్యానెల్‌లను ఉత్పత్తి చేయడం, దేశవ్యాప్తంగా సరసమైన ధరలకే వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే వైపుగా పని చేస్తామని కంపెనీ వివరించింది. దీనికోసం చైనాకు చెందిన జిన్‌చెన్‌తో మైక్రోమ్యాక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ భాగస్వామ్యంతో 5 గిగావాట్ సామర్థ్యం కలిగిన అధునాతన సోలార్ ప్యానెళ్లను తయారు చేయనుంది. ఈ ప్రక్రియ దశల వారీగా జరుగుతుందని, ఆటోమేషన్, హై-ఎఫిషియన్సీ మాడ్యూల్ ప్రొడక్షన్ టెక్నాలజీ ద్వారా తయారీ కార్యకలాపాలను నిర్వహించనున్నట్టు మైక్రోమ్యాక్స్ ఎండీ రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు.