- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Festval Season: పండుగ సీజన్ అమ్మకాలపై లగ్జరీ కార్ల కంపెనీల ఆశలు
దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది పండుగ సీజన్ కోసం వాహన తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న విలాస ఖర్చులు, బ్రాండెడ్ కొనుగోళ్లను దృష్టిలో ఉంచుకుని లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు ఈ పండుగ సీజన్‌ను విక్రయాలు పెంచుకునేందుకు అవకాశంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. మెర్సిడెస్ బెంజ్, ఆడీ, బీఎండబ్ల్యూ కంపెనీలు దేశీయంగా హై-ఎండ్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే ప్రీమియం కార్ల విక్రయాలు అత్యధికంగా జరిగాయి, దీన్ని పండుగ సీజన్ మరింత పెంచుతుందనే నమ్మకం ఉందని మెర్సిడెజ్ బెంజ్ సీఈఓ సంతోష్ అయ్యర్ అన్నారు. భారత ఆర్థికవ్యవస్థ అత్యంత సానుకూల దశలో ఉంది. ప్రధానంగా లగ్జరీ సెగ్మెంట్‌లో వినియోగదారులు ఎక్కువ విశాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది పండుగ సీజన్ అమ్మకాలకు బూస్టప్ ఇస్తుందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా చెప్పారు. ఇప్పటికే కార్ల కోసం ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయని, డెలివరీలను వీలైనంత వేగంగా అందిస్తూ దసరా, దీపావళి కోసం చాలా బుకింగ్‌లు వచ్చాయని కంపెనీలు వెల్లడించాయి. కస్టమర్ల నుంచి కనిపిస్తున్న డిమాండ్ ఆధారంగా లగ్జరీ కార్ల విభాగంలో రెట్టింపు వృద్ధికి అవకాశం ఉందని విక్రమ్ పవా పేర్కొన్నారు.