- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెల్ఫ్-లాండ్రీ సర్వీసుల్లోకి అడుగుపెడుతున్న ఎల్‌జీ ఇండియా
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా కమర్షియల్ వాషింగ్ మెషీన్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే సెల్ఫ్-లాండ్రీ సర్వీసుల వ్యాపారంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుత కేలండర్ ఏడాదిలో దేశవ్యాప్తంగా 200 సెల్ఫ్ లాండ్రీ సర్వీస్ సెంటర్లను ప్రారంభించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. దీనికోసం కంపెనీ సుమారు రూ. 34 కోట్ల వరకు పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ప్రధానంగా విద్యా సంస్థల పరిధిలో ఇటువంటి కమర్షియల్ లాండీ సేవలు ఎంతో ఉపయోగాపడతాయని కంపెనీ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే గ్రేటర్ నోయిడాలోని గల్గొటియస్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం కుదుర్చుకుంది. మొదట 1,500 మంది విద్యార్థులకు మెషిన్ రిజర్వేషన్, ఆపరేట్, ఆటోమేటెడ్ చెల్లింపుల కోసం యాప్ ద్వారా ఎల్‌జీ కమర్షియల్ వాషింగ్ మెషీన్‌లను ఉపయోగించుకునే కార్యక్రమాన్ని ప్రారంభించింది. 'విద్యా సంస్థల్లో సెల్ఫ్ లాండ్రీ సర్వీసుల కారణంగా విద్యార్థులకు సౌకర్యాలను కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్టు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జూ జియోన్ వెల్లడించారు.