బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన లావా

by S Gopi |
బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన లావా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ మొబైల్‌ఫోన్ తయారీ బ్రాండ్ లావా మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లావా 02 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ అత్యంత వేగవంతమైన పనితీరును కలిగిన స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ ప్రకటించింది. 8జీబీ, 128జీబీతో ఒకే ఒక వేరియంట్‌లో తీసుకొచ్చిన లావా 02 ధర రూ. 8,999కే లభిస్తుందని, ప్రారంభ ఆఫర్ కింద రూ. 7,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ నెల 22 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు మొదలవుతాయని, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. 50-మెగాపిక్సెల్ డ్యుయెల్ ఏఐ కెమెరా, బాటమ్ ఫైరింగ్ స్పీకర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్-సీ యూఎస్‌బీ కేబుల్‌తో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, మెరుగైన భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్ వంటి ముఖ్యమైన ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వివరించింది. లావా 02కు రెండేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్ సౌకర్యం కల్పిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఫోన్‌లో ఉన్నాయి. 'నిరంతరం మారుతున్న వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా లావా 02ను సరికొత్త గ్లాస్ బ్యాక్ డిజైన్ లాంటి ఫీచర్లతో పాటు స్టైలిష్, మెరుగైన ఫంక్షనాలిటీతో తీసుకొచ్చామని' లావా ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ హెడ్ సుమిత్ సింగ్ అన్నారు.

Advertisement

Next Story