ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్!

by Harish |
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్!
X

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తం డిపాజిట్లపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ బ్యాంకు నిర్ణయించింది. పెంచిన రేట్లు గురువారం(మే 11) నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది.

బ్యాంకు అధికారిక వివరాల ప్రకారం, సాధారణ ఖాతాదారులకు ఎఫ్‌డీలపై 2.75 శాతం నుంచి 7.20 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి 7.70 శాతం మధ్య వడ్డీ రాబడి అందుతుంది. గరిష్ఠంగా బ్యాంకు సాధారణ ఖాతాదారులకు 180 రోజుల కాలవ్యవధిపై 7 శాతం వడ్డీ ఇవ్వనున్నట్టు బ్యాంకు వెల్లడించింది.

ఇక 365 రోజుల నుంచి 389 రోజుల డిపాజిట్లపై 7.10 శాతం, 390 రోజుల నుంచి 2 ఏళ్ల వరకు 7.20 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక, కోటక్ మహీంద్రా బ్యాంక్ రికరింగ్ డిపాజిట్లపై సాధారణ ఖాతా దారులకు 6 నెలల నుంచి 10 ఏళ్ల కాలానికి 6 శాతం నుంచి 7.20 శాతం వడ్డీ ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు అధికంగా 6.50 శాతం నుంచి 7.70 శాతం వడ్డీ లభిస్తుంది.

Advertisement

Next Story