- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారీగా తగ్గిన కిరోసిన్ వినియోగం
దిశ, బిజినెస్ బ్యూరో: గడిచిన పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కిరోసిన్ వినియోగం భారీగా తగ్గింది. కేంద్ర ప్రభుత్వం క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు తీసుకున్న విధాన నిర్ణయాలే ఇందుకు కారణమని గణాంకాలు చెబుతున్నాయి. నేషనల్ స్టిటిస్టికల్ ఆఫీస్(ఎన్ఎస్ఓ) తాజా 'ఎనర్జీ స్టిటిస్టిక్స్ ఇండియా-2024' గణాంకాల ప్రకారం.. 2013-14 నుంచి 2022-23 మధ్య దేశంలో కిరోసిన్ వాడకం ఏటా సగటున 26 శాతం తగ్గింది. ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకున్న ఇంధన విధానాల ప్రభావం కిరోసిన్ వినియోగంపై స్పష్టం కనిపిస్తోంది. అన్ని పెట్రోలియం ఉత్పత్తులలో అత్యధిక వినియోగం కలిగిన డీజిల్ 2022-23లో 12.05 శాతం పెరిగింది. పెట్రోల్ సైతం గతేడాది కంటే 13.38 శాతం అధికంగా నమోదైంది. సహజవాయువు వినియోగంలో ప్రతి ఏటా హెచ్చుతగ్గులను ఎదుర్కొంటోందని నివేదిక తెలిపింది. గణాంకాల ప్రకారం, విద్యుత్ వినియోగం 2012-13లో 8.24 లక్షల గిగావాట్ అవర్ నుంచి 2021-22లో 12.96 లక్షల గిగావాట్ అవర్‌కి పెరిగింది. ఇది ఏడాదికి సగటున 5.16 శాతం వృద్ధి నమోదైందని నివేదిక పేర్కొంది. 2021-22లో మొత్తం విద్యుత్ వినియోగంలో పరిశ్రమల రంగం అత్యధికంగా 41.16 శాతం వాడుకోగా, ఇంటి వినియోగానికి 25.77 శాతం, వ్యవసాయం 17.67 శాతం, వాణిజ్య రంగాల్లో 8.29 శాతం వినియోగం జరిగింది.