జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-12-28 16:39:53.0  )
జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
X

ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే(ఐఐటీ బాంబే)తో కలిసి 'భారత్ జీపీటీ'ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. గురువారం ఐఐటీ బాంబే విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ, 'జియో 2.0 కోసం పనిచేస్తున్నాం. ప్రధానంగా 'ఎకోసిస్టమ్ ఆఫ్ డెవలప్‌మెంట్'పై దృష్టి సారించాం. వచ్చే దశాబ్ద కాలంలో అనేక మార్పులు జరగనున్నాయని, కృత్రిమ మేధ(ఏఐ) అప్లికేషన్ల ద్వారా చాలామంది ప్రభావితం కానున్నారు. పూర్తిస్థాయిలో ఏఐ అందుబాటులోకి వస్తే కంపెనీ ఉత్పత్తులు, సేవలకు సంబంధించి విప్లవాత్మక మార్పులను చూడవచ్చు. తమ కంపెనీల్లోని అన్ని రంగాల్లో ఏఐని వినియోగించేందుకు కృషి చేస్తున్నట్టు' ఆకాశ్ అంబానీ వివరించారు. అన్ని రంగాల్లో కొత్తదనం కోసం పనిచేస్తున్నాం. రాబోయే 10 ఏల్లలో భారత్ 'ఇన్నోవేషన్ సెంటర్ 'గా ఎదగనుంది. సమాజం, పరిశ్రమల్లో ఏఐ కీలకంగా ఉంటుందని ఆకాశ్ తెలిపారు. జియో కార్యకలాపాలు దేశానికి ప్రయోజనకరంగా ఉంటాయనే విశ్వాసం ఉంది. యువ పారిశ్రామికవేత్తలు రిస్క్ తీసుకుని సమాజహితం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇక, భవిష్యత్తులో టెలివిజన్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్టు చెప్పారు.

Read More..

గ్లోబల్ లీడర్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్..

Advertisement

Next Story

Most Viewed