- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Jio: జియో కస్టమర్లకు షాక్! రెండు పాపులర్ ప్లాన్స్ సైలెంట్‌గా ఎత్తేసిన సంస్థ

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ టెలికామ్ దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో (Jio) కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం అమలు చేస్తున్న (Two popular prepaid plans) రెండు పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను తొలగించింది. వాయిస్, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకురావాలంటూ టెలికాం సంస్థలకు ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ప్లాన్లను జియో తీసుకు వచ్చి.. పాత రెండు ప్లాన్లను తొలగించింది. వాల్యూ ప్లాన్స్ (Value Plans) గా వ్యవహరించే రూ.189, రూ. 479 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను తన వెబ్ సైట్ నుంచి తీసివేసింది.
గతంలో తక్కువ డేటా, ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో రీచార్జ్ ప్లాన్లు కావాలనుకే యూజర్ల కోసం జియో ఈ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. రూ. 189 ప్లాన్‌తో 28 రోజులు వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు వచ్చేది. మరోవైపు 2 జీబీ డేటా కూడా ఇచ్చేది. రూ. 479 ప్లాన్‌పై 84 రోజుల వ్యాలిడిటీ ఉండేది. ఇందులో అన్‌లిమిటెల్ వాయిస్ కాల్స్, వెయ్యి ఎస్ఎంఎస్‌లు, 6జీబీ డేటా వంటి ప్రయోజనాలు వచ్చేవి. ట్రాయ్ (Troy) ఆదేశాల కారణంగా రెండు వాయిస్ ఓన్లీ ప్లాన్లను జియో ఇటీవల ప్రవేశపెట్టింది.
84 రోజుల గడువుతో రూ. 458 ప్లాన్, దానితో పాటు 365 రోజుల వ్యాలిడీటితో రూ. 1958 ప్లాన్ జియో తీసుకు వచ్చింది. వీటికి జియో టీవీ, సినిమా, క్లౌడ్ సబ్ స్క్రిప్షన్ వంటి సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. ప్లాన్స్ ధరలు ఎక్కవగా ఉన్నాయని ట్రాయ్ కీలక ప్రకటన కారణంగా ఈ ప్రయోజనాలను అలాగే ఉంచుతూ ప్లాన్ ధరలు మాత్రం జియో తగ్గించింది. దీంతో 458 ప్లాన్ రూ. 448కు, అలాగే 1958 ప్లాన్ ఏమో 1748కి తగ్గించింది. ఆ నేపథ్యంలో వాల్యూ ప్లాన్లను తీసివేసింది.