Jeff Bezos: 3 బిలియన్ డాలర్ల షేర్లను విక్రయించిన జెఫ్ బెజోస్

by Shamantha N |   ( Updated:2024-11-03 08:21:54.0  )
Jeff Bezos: 3 బిలియన్ డాలర్ల షేర్లను విక్రయించిన జెఫ్ బెజోస్
X

దిశ, బిజినెస్: అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) తన కంపెనీ షేర్లను విక్రయించారు. ఈ- కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన ప్రధాన వాటాను విక్రయించారు. అమెజాన్‌(Amazon)కు చెందిన 3 బిలియన్ డాలర్ల (రూ.25 వేల కోట్ల) విలువైన షేర్లను విక్రయించారు. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో, ఇప్పటివరకు అమెజాన్‌లో మొత్తంగా 13 బిలియన్‌ డాలర్ల విలువ చేసే షేర్లును విక్రయించారు. అంటే 16 మిలియన్లకు పైగా షేర్లను అమ్మారని తెలుస్తోంది. అమెజాన్‌ ఇటీవలే ప్రకటించిన మూడో త్రైమాసిక ఫలితాల్లో గణనీయమైన వృద్ధిని కనబర్చింది. దీంతో కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. ఒక్కో షేరు విలువ 200 డాలర్లను తాకింది. మొత్తం మీద అమెజాన్‌ షేర్లు గతేడాది కంటే 40శాతం కంటే ఎక్కువ లాభపడ్డాయి.

ప్రపంచ సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి

ఇకపోతే, షేర్ల అమ్మకం ఫలితంగా బెజోస్‌ సంపద పెరిగింది. దీంతో ఆయన ప్రపంచ సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో ఎలాన్‌ మస్క్‌ ఉన్నారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ప్రస్తుతం 262 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో ఎలాన్‌ మస్క్‌ అగ్రస్థానంలో ఉన్నారు. జెఫ్‌ బెజోస్‌ సంపద విలువ 222 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ 201 బిలియన్‌ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.

Advertisement

Next Story