IRCTC: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ మరోసారి డౌన్.. టికెట్ బుకింగ్ సమయంలో ఇబ్బందులు..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-31 12:37:37.0  )
IRCTC: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ మరోసారి డౌన్.. టికెట్ బుకింగ్ సమయంలో ఇబ్బందులు..!
X

దిశ,వెబ్‌డెస్క్: ‘ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్ మంగళవారం మరోసారి డౌన్(Down) అయ్యింది. ఈ రోజు ఉదయం తత్కాల్(Tatkal) టికెట్ బుకింగ్ సమయంలో వెబ్‌సైట్ మొరాయించింది. న్యూ ఇయర్(New Year) సందర్భంగా ట్రిప్ ప్లాన్(Trip Plan) చేసుకున్నవాళ్లు టికెట్ బుక్(Ticket Book) చేసుకుందాం అంటే సర్వర్(Server)లో సమస్య తలెత్తింది. దీంతో రైల్వే ప్రయాణికులు(Railway Passengers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా 'ఎక్స్(X)' వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. కాగా ఈ విషయంపై రైల్వే శాఖ(Railway Department) ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ డౌన్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రెండు సార్లు కూడా ఇలానే మొరాయించింది. డిసెంబర్ 26న గంట పాటు ఐఆర్‌సీటీసీ సేవలు నిలిచిపోగా.. అంతకముందు డిసెంబర్ 9న కూడా రెండు గంటల పాటు వెబ్‌సైట్ పనిచేయలేదు. దీనివల్ల ప్రయాణికులకు టికెట్ బుకింగ్ లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.

Advertisement

Next Story