- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Post Office Scheme: పోస్ట్‌ఆఫీస్ స్కీమ్స్ బెస్ట్ అనేది ఇందుకే.. నెలకు రూ.5000 డిపాజిట్ చేస్తే చేతికి లక్షలు ఇచ్చే పథకం

దిశ, వెబ్‌డెస్క్: Post Office Scheme: ప్రతిఒక్కరూ సంపాదన నుంచి ఎంతో కొంత ఆదా చేస్తుంటారు. ఆ డబ్బును సురక్షిత ప్రదేశంలో పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తుంటారు. దీంతో మంచి రాబడిని పొందుతారు. ఈ విషయంలో పోస్టాఫీస్(Post Office) చిన్న పొదుపు పథకాలు ఎన్నో ప్రజాదరణ పొందాయి. వీటిలో పోస్టాఫీస్ రికవరింగ్ డిపాజిట్ స్కీమ్(Post Office Recovering Deposit Scheme) కూడా ఉంది. దీనిలో మీరు ప్రతినెలా కేవలం 5000 పెట్టుబడి పెడితే రూ. 8లక్షల వరకు భారీ మొత్తాన్ని పొందవచ్చు. ఈ స్కీములో ఇన్వెస్ట్ మెంట్ పై రుణం కూడా లభిస్తుంది.
గత ఏడాది రెండేళ్ల క్రితం పోస్టాఆఫీస్ రికవరింగ్ డిపాజిట్ స్కీము(Post Office Recovering Deposit Scheme)పై వడ్డీరేట్లను పెంచడం ద్వారా ప్రభుత్వం పెట్టుబడిదారులకు బహుమతి అందించింది. ఈ కొత్త రేట్లు అక్టోబర్ -డిసెంబర్ 2023 త్రైమాసికానికి వర్తిస్తాయి. ఈ స్కీములు పెట్టుబడిపై వడ్డీ రేటు గురించి తెలుసుకుంటే అప్పుడు 6.7శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి సవరిస్తుంది. ఈ స్కీములో చివరి సవరణ 29 సెప్టెంబర్ 2023న జరిగింది.
పోస్టాఫీస్ ఆర్ డిలో పెట్టుబడి, వడ్డీని లెక్కించడం సులభం. మీరు నెలకు రూ. 5000ఆదా చేస్తే ఈ స్కీము ద్వారా రూ. 8లక్షల నిధి ఎలా సేకరించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు పోస్ట్ ఆఫీస్ రికవరింగ్ డిపాజిట్ స్కీము(Post Office Recovering Deposit Scheme)లో ప్రతినెలా రూ. 5000 డిపాజిట్ చేసినట్లయితే దాని మెచ్యూరిటీ వ్యవధిలో అంటే 5ఏళ్లలో మొత్తం రూ. 3లక్షలు డిపాజిట్ చేస్తారు. ఈ మొత్తానికి రూ. 56, 830 వడ్డీని కలుపుతారు. వడ్డీ రేటు 6.7శాతం అంటే మొత్తంగా 5ఏళ్లలో మీ ఫండ్ రూ. 3, 56, 830 అవుతుంది.
ఇప్పుడు మీరు కంటిన్యూ చేయాలనుకుంటే ఈ ఆర్ డి ఖాతా(RD account)ను మరో 5ఏళ్లపాటు పొడిగించుకోవచ్చు. మీరు దానిని తదుపరి 5ఏళ్లకు పొడిగిస్తే 10ఏళ్లలో డిపాజిట్ చేసిన మొత్తం రూ. 6,00, 000 అవుతుంది. దీంతోపాటు ఈ డిపాజిట్ పై 6.7శాతం వడ్డీ కలిపి మొత్తం 2,54,272 అవుతుంది. దీనిప్రకారంగా చూస్తే 10ఏళ్ల వ్యవధిలో డిపాజిట్ చేసిన మొత్తం ఫండ్ రూ. 8,54,272 అవుతుంది.
మీ సమీపంలోని పోస్టాఫీస్ కు వెళ్లి రికవరింగ్ డిపాజిట్ స్కీము(Post Office Recovering Deposit Scheme)లో అకౌంట్ తీసుకోవచ్చు. 100 రూపాయల నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే మీరు ఈ వ్యవధి పూర్తయ్యేలోపు ఖాతాను మూసివేయాలనుకుంటే ఈ సేవింగ్ స్కీములో కూడా ఈ సౌకర్యం ఉంటుంది. పెట్టుబడిదారుడు 3ఏళ్ల తర్వాత ప్రీ మెచ్యూర్ క్లోజర్(Premature closure) తీసుకోవచ్చు. దీనిలో రుణసదుపాయం కూడా ఉంటుంది. ఖాతా ఒక ఏడాది పాటు యాక్టివ్ గా ఉన్న తర్వాత డిపాజిట్ చేసిన మొత్తంలో 50శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. అయితే లోన్ వడ్డీ రేటు అసలు వడ్డీ రేటు కంటే 2 శాతం ఎక్కువగా ఉంటుంది.