Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి కొత్త ఫీచర్.. ఇకపై లైవ్ లొకేషన్ షేర్ చేసుకునే ఆప్షన్..!

by Maddikunta Saikiran |
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి కొత్త ఫీచర్.. ఇకపై లైవ్ లొకేషన్ షేర్ చేసుకునే ఆప్షన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: మెటా(Meta)కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్(New Feature)లను ప్రవేశ పెడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే వాట్సాప్(whatsApp) తరహాలో అనేక ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్‌లోకి తీసుకొస్తోంది. అయితే ఇదివరకే వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేసుకునే ఆప్షన్ ఉన్న విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా మెటా తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మనం లొకేషన్(Location)ను షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు చాట్(Chat)లోకి వెళ్లిన తర్వాత మెనూబార్(Menu Bar)లో లొకేషన్ ఆప్షన్(Option)ను చూజ్ చేసుకోవాలి. కరెంట్ లొకేషన్(Current Location)తో వన్ అవర్(One Hour) పాటు లైవ్ లొకేషన్(Live location)నూ షేర్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ కొన్ని దేశాలకే పరిమితం చేస్తున్నట్లు మెటా సంస్థ పేర్కొంది. త్వరలోనే అన్ని దేశాలలో ఈ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed