- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Infosys: ఉద్యోగులకు 5-8 శాతం జీతం పెంచిన ఇన్ఫోసిస్.. నెలాఖర్లో లెటర్ల జారీ

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. అర్హత ఉన్న ఉద్యోగుల జీతాలను పెంచాలని నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి చివరి నాటికి జీతాల పెంపు లేఖలను కంపెనీ జారీ చేయనుంది. సగటున ఈ పెంపు 5-8 శాతం వరకు ఉంటుందని అంచనా. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెరిగిన జీతాలు అమల్లోకి వస్తాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెక్నాలజీ రంగంలో ఖర్చులు పెరుగుతాయని చాలా ఐటీ కంపెనీలు భావిస్తునాయి. డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఈ పెంపు నిర్ణయం తీసుకుంది. ఇటీవల డిసెంబర్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా వేతనాల పెరుగుదల 6-8 శాతం ఉంటుందని కంపెనీ సీఎఫ్ఓ జయేశ్ సంఘ్‌రాజ్‌కా చెప్పారు. ఇప్పటికే ఇన్ఫొసిస్ బ్యాచ్‌ల వారీగా ప్రమోషన్ లెటర్లను జారీ చేయడం మొదలుపెట్టింది. డిసెంబర్‌లో మొదటి బ్యాచ్‌కు అందించగా, ఈ నెలాఖరు నాటికి మరికొంత మంది ఉద్యోగులకు ఇవ్వనుంది. కాగా, గత రెండేళ్ల నుంచి ఐటీ కంపెనీలు జీతాల పెంపునకు సంబంధించి వాయిదా వేస్తున్నాయి. ఇటీవల పరిస్థితులు సానుకూలంగా మారాయి. ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చే ఆదాయం కలిగిన ఐటీ కంపెనీలకు టెక్నాలజీ బడ్జెట్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఇన్ఫోసిస్‌లో 3.43 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.