- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Forex Reserves: ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి భారత ఫారెక్స్ నిల్వలు
దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఫారెక్స్ నిల్వలు సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) శుక్రవారం ప్రకటనలో తెలిపింది. ఈ నెల 6వ తేదీతో ముగిసిన వారానికి భారత ఫారెక్స్ నిల్వలు 5.2 బిలియన్ డాలర్లు పెరిగి ఆల్‌టైమ్ హై 689.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతకుముందు ఆగష్టు 30తో ముగిసిన వారంలో నిల్వలు 2.3 బిలియన్ డాలర్లు పెరిగి 683.99 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఆర్‌బీఐ వీక్లీ స్టాటిస్టికల్ డేటా ప్రకారం.. మొత్తం ఫారెక్స్ నిల్వల్లో విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ 5.10 బిలియన్ డాలర్లు పెరిగి 604.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ కరెన్సీల్లో యూరో, పౌండ్, యెన్, యూఎస్ డాలర్ వంటి కరెన్సీ ఆస్తులు అధికంగా ఉన్నాయి. అలాగే, బంగారం నిల్వలు 129 మిలియన్ డాలర్లు పెరిగి 61.98 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక, ఐఎంఎఫ్ వద్ద మన దేశ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 9 మిలియన్ డాలర్లు పెరిగి 4.63 బిలియన్ డాలర్లకు చేరాయి. అమెరికా డాలరుతో భారత కరెన్సీ రూపాయి మారకం క్షీణతను నియంత్రించేందుకు ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ద్వారా జోక్యం చేసుకుంటోంది.