- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Attrition Rates: 2020 తర్వాత అత్యంత కనిష్టానికి తగ్గిన అట్రిషన్ రేటు

దిశ, బిజినెస్ బ్యూరో: గతేడాది దేశవ్యాప్తంగా కార్పొరే కంపెనీల్లో అట్రిషన్ రేటు గణనీయంగా దిగొచ్చింది. ఇది 2020 నాటి కొవిడ్ మహమ్మారి తర్వాత ఇదే అత్యల్పమని డెలాయిట్ ఇండియా టాలెంట్ ఔట్‌లుక్ సర్వే తెలిపింది. నియామకాలు క్షీణించడం, ఆర్థిక సవాళ్లు, లేఆఫ్, మార్కెట్ అనిశ్చితుల కారణంగా అవకాశాలు తగ్గడం వంటి పరిణామాల కారణంగానే అట్రిషన్ రేటు తగ్గింది. ఈ పరిణామాల వల్ల ఉద్యోగులు సాధ్యమైనంత వరకు ఉద్యోగాలు మారడంపై అనాసక్తి చూపిస్తున్నారని డెలాయిట్ ఇండియా పేర్కొంది.
గణాంకాల ప్రకారం.. గతేడాది సగటున అట్రిషన్ రేటు 17.4 శాతంగా నమోదైంది. ఇది అంతకుముందు ఏడాదిలో 18.1 శాతం, 2022లో 20.2 శాతం, 2021లో 19.4 శాతంతో పోలిస్తే చాలా మెరుగుపడింది. 2020 అట్రిషన్ రేటు అత్యల్పంగా 15.8 శాతంగా ఉండేది. ఆ తర్వాత కొవిడ్-19 మహమ్మారి ప్రభావంతో క్రమంగా అట్రిషన్ రేటు పెరుగుతూ వచ్చింది. ప్రధానంగా ఐటీఈఎస్(ఐటీ ఆధారిత సేవలు) రంగంలో అట్రిషన్ రేటు గణనీయంగా దిగొచ్చింది. 2023లో 18.7 శాతం నుంచి 2024లో 10.8 శాతానికి పడిపోయింది. ఐటీ రంగంలోనూ అట్రిషన్ రేటు 2023లో 19.3 శాతం నుంచి 15.1 శాతానికి తగ్గింది. కెరీర్ వృద్ధి, ఇతర అంశాల కారణంగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో జీతాల పెరుగుదల ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలతో అట్రిషన్ రేటును తగ్గించగలిగాయి. మిగిలిన రంగాల్లో కన్స్యూమర్ రంగం మినహా దాదాపు అన్ని పరిశ్రమల్లోనూ అట్రిషన్ రేటు క్షీణించింది. చాలా కంపెనీలు రానున్న సంవత్సరాల్లో నియామకాలు పెంచుతామని చెబుతున్నాయి. ఫలితంగా వచ్చే 3-6 త్రైమాసికాల్లో అట్రిషన్ రేటులో గణనీయమైన మార్పు రావొచ్చని డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ ఆనందోరూప్ ఘోష్ అభిప్రాయపడ్డారు. పనిచేస్తున్న కంపెనీని విడిచిపెట్టి, రకరకాల కారణాలతో ఇతర కంపెనీల్లోకి ఉద్యోగులు వలస వెళ్లడాన్ని అట్రిషన్ రేటు అంటారు. మిగిలిన రంగాలకు సంబంధించి ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఇది 27.9 శాతం నుంచి 26.4 శాతానికి, లైఫ్ సైన్సెస్‌లో 19.3 శాతం నుంచి 15.1 శాతానికి, తయారీలో 12.1 శాతం నుంచి 10.6 శాతానికి, సేవా రంగంలో 17.9 శాతం నుంచి 17.7 శాతానికి క్షీణించింది. కన్స్యూమర్ రంగంలో మాత్రమే 17.4 శాతం నుంచి 18.4 శాతానికి పెరిగింది.