- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏఐ పురోగతిలో భారత్‌దే కీలక పాత్ర: ఐబీఎం ఎండీ సందీప్
దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) విప్లవంలో భారత్ గణనీయమైన వాటాను కలిగి ఉందని టెక్ దిగ్గజం ఐబీఎం దక్షిణాసియా ఎండీ సందీప్ పటేల్ అన్నారు. ముఖ్యంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేయడమే కాకుండా నైపుణ్యాన్ని పెంచేందుకు పరిశ్రమతో భాగస్వామ్యం కావడంలో ప్రభుత్వ చొరవ మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. ఆదివారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్ పటేల్, ఏఐతో ఆత్మ నిర్భర్ లక్ష్యం సాధించాలంటే ప్రపంచంలో ఏఐ వినియోగం, ఆవిష్కరణలకు భారత్ కేంద్రంగా మారాల్సిన అవసరం ఉంది. ఏఐలో పురోగతి సాధించే క్రమంలో పాలసీ విధానాల రూపకల్పన, ఏఐ పెట్టుబడులు, నైపుణ్యం, ఆర్అండ్‌డీ వంటి అంశాలను స్థిరంగా కొనసాగించాలి. ప్రధానంగా ఏఐకి ఆర్అండ్‌డీ చాలా అవసరం. వీటన్నిటినీ బాధ్యతాయుతంగా చేపట్టాలని ఆయన వివరించారు. భారత ప్రభుత్వం కూడా ఏఐ విషయంలో బాధ్యతాయుతంగా ఉంది. గతేడాది ప్రకటనలో దేశ ప్రధాని మోడీ 'నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ 'ను ప్రారంభిస్తామని చెప్పారు. దీని ద్వారా వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాల్లో ఏఐ అప్లికేషన్‌లను తీసుకురానున్నట్టు పేర్కొన్నారని సందీప్ పటేల్ వెల్లడించారు. భారత్ తప్పనిసరిగా ఏఐ కేంద్రంగా మారాలి. సరైన పాలసీ విధానాలతో మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.