- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుసగా కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్న జియో, ఎయిర్‌టెల్!
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికాం సబ్‌స్క్రైబర్ బేస్ స్వల్పంగా పెరిగి 1,170.75 మిలియన్లకు చేరుకుందని టెలికాం నియంత్రణ సంస్థ TRAI తెలిపింది. వైర్‌లైన్ విభాగంలో 0.28 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లు, మొబైల్ టెలిఫోన్ విభాగంలో 0.09 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లు పెరిగారు. ముఖ్యంగా "భారతదేశంలో టెలిఫోన్ చందాదారుల సంఖ్య డిసెంబర్ 2022 చివరి నాటికి 1,170.38 మిలియన్ల నుండి 2023 జనవరి చివరి నాటికి 1,170.75 మిలియన్లకు పెరిగింది, తద్వారా నెలవారీ వృద్ధి రేటు 0.03 శాతంగా ఉంది" అని ట్రాయ్ తన నివేదికలో పేర్కొంది.
జియో, ఎయిర్‌టెల్ సంయుక్తంగా 0.29 మిలియన్ల కొత్త కస్టమర్లను చేర్చుకున్నప్పటికీ, BSNL, వోడాఫోన్ ఐడియా 0.28 మిలియన్ల కస్టమర్లను కోల్పోయాయి. దేశంలో వైర్‌లైన్ లేదా ఫిక్స్‌డ్ లైన్ కనెక్షన్‌లు డిసెంబర్‌లో 27.45 మిలియన్ల నుండి జనవరిలో 27.73 మిలియన్లకు పెరిగాయి. ఈ విభాగంలో కొత్తగా జియో 0.21 మిలియన్, ఎయిర్‌టెల్ 0.11 మిలియన్, క్వాడ్రంట్ 5,949 కస్టమర్లను జోడించాయి.
వైర్‌లెస్ విభాగంలో, జియో 1.65 మిలియన్లు, ఎయిర్‌టెల్ 1.28 మిలియన్ల కస్టమర్లను జోడించాయి. అదే BSNL 1.48 మిలియన్లు, వోడాఫోన్ ఐడియా 1.35 మిలియన్లు, MTNL 2,960 మంది మొబైల్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయాయి. బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్ బేస్ డిసెంబర్‌లో 832.2 మిలియన్ల నుండి జనవరిలో 839.18 మిలియన్లకు పెరిగింది. ఈ విభాగంలో జనవరి నెల వరకు జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్- 434.02 మిలియన్లు, భారతీ ఎయిర్‌టెల్-237.40 మిలియన్లు, వోడాఫోన్ ఐడియా- 125.03 మిలియన్లు, BSNL- 27.05 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్నాయని TRAI తెలిపింది.