- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత మార్కెట్లో రెండో దశ విస్తరణకు సిద్ధమైన ఐకియా..!
హైదరాబాద్ : ప్రముఖ ఫర్నీచర్ కంపెనీ ఐకియా భారత మార్కెట్లో విస్తరణపై దృష్టి సారించింది. 2024 చివరి నాటికి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఆన్‌లైన్ కార్యకలాపాలను ప్రారంభించడంతో పాటు దేశ వ్యాప్తంగా రిటైల్ ఫార్మాట్‌లో ఓమ్ని ఛానెళ్ల ఏర్పాటు ద్వారా దేశీయంగా రెండో దశ వృద్ధిని కొనసాగిస్తామని ఐకియా వెల్లడించింది. అదేవిధంగా తన నెట్‌వర్క్ పరిధిని పెంచి కొత్త స్టోర్లను ప్రారంభిస్తామని ఐకియా ఇండియా సీఈవో సుసానె పుల్వెరెర్ తెలిపారు.
పూణె, చెన్నై లాంటి మహా నగరాల్లో కూడా ఐకియా స్టోర్ల ఏర్పాటుతో పాటు లోకల్ సోర్సింగ్‌ను పెంచి ఉత్పత్తులను మరింత తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చే విధంగా కార్యకలాపాలను విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశీయంగా వ్యాపార వృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని సుసానె అన్నారు. రానున్న రోజుల్లో కనీసం ఐదు కొత్త స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే రూ.10,500 కోట్ల పెట్టుబడులను ప్రకటించామని, మరో ఐదేళ్లలో మరింత వేగవంతమైన విస్తరణను చేపడతామని వెల్లడించారు.