- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IDBI Bank: మార్చి నాటికి ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు ఫైనాన్షియల్ బిడ్‌ల ఆహ్వానం
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోపు ఐడీబీఐ బ్యాంక్ కోసం ఫైనాన్షియల్ బిడ్‌ల ప్రక్రియ జరుగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సామర్థ్యం కలిగిన బిడ్డర్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఫిట్ అండ్ ప్రాపర్ నివేదికను అందించింది. కాబట్టి తదుపరి ప్రక్రియ ముందుకెళ్లనుంది. అందులో భాగంగా రానున్న నెలల్లో అర్హత కలిగిన బిడ్డర్లకు ఐడీబీఐ బ్యాంకుకు సంబంధించి వర్చువల్ డేటాకు యాక్సెస్ లభిస్తుంది. మరికొన్ని నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. దీని తర్వాత ఫైనాన్షియల్ బిడ్‌లను ఆహ్వానిస్తారు. ఈ ప్రక్రియ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీలైనంత తొందరగా ప్రైవేటీకరణ ప్రక్రియ ముగుస్తుందని, 2025-26 ఆర్థిక సంవత్సరంలోపు ఇది పూర్తవుతుందని తెలుస్తోంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 50 వేల కోట్ల వరకు సమీకరించాలని భావిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు రూ. 38,319 కోట్లను దీపమ్ రసీదుల రూపంలో సమీకరించింది.