SEBI: సెబీ చీఫ్ మాధబి బుచ్‌కు ఎలాంటి జీతం ఇవ్వడంలేదు: ఐసీఐసీఐ బ్యాంక్

by S Gopi |
SEBI: సెబీ చీఫ్ మాధబి బుచ్‌కు ఎలాంటి జీతం ఇవ్వడంలేదు: ఐసీఐసీఐ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పూరి బుచ్‌కు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఐసీఐసీఐ బ్యాంక్ వివరణ ఇచ్చింది. ఆమె బ్యాంకు లేదా బ్యాంక్ గ్రూప్ నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ మినహా ఎలాంటి జీతం గానీ, ఎంప్లాయి స్టాక్ ఆప్షన్లను కేటాయించలేదని సోమవారం ప్రకటనలో స్పష్టం చేసింది. ఐసీఐసీఐ గ్రూప్‌లో ఆమె ఉద్యోగం చేస్తున్న సమయంలో వర్తించే పాలసీలకు అనుగుణంగా జీతం, బోనస్, ఎంప్లాయి స్టాక్ ఆప్షన్‌లు పొందారు. కానీ రిటైర్‌మెంట్ తర్వాత ఎటువంటి వేతనం చెల్లించలేదని, పదవీ విరమణ ప్రయోజనాలు మాత్రమే అందుతున్నాయని బ్యాంకు వివరించింది. అందులో స్టాక్ ఆప్షన్లు, ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. 2013, అక్టోబర్‌లో మాధబి పూరి బుచ్ బ్యాంకు నుంచి పదవీ విరమణ పొందారని ఐసీఐసీఐ బ్యాంక్ స్పష్టం చేసింది. స్టాక్ ఆప్షన్‌లకు సంబంధించి బ్యాంక్ నిబంధనల ప్రకారం కేటాయించిన తేదీ వరకు ఉంటాయి. వీటిని రిటైల్ ఉద్యోగులు కాకుండా ఇతరులు 10 ఏళ్ల వరకు ఎప్పుడైనా వాడుకునే వీలుంటుందని పేర్కొంది. కాగా, మాధబి పూరి బుచ్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 16.8 కోట్ల జీతం ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది.

Advertisement

Next Story