- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
తమిళనాడులో హ్యూండాయ్ రూ. 6,180 కోట్ల పెట్టుబడులు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా దేశీయంగా భారీ పెట్టుబడులను ప్రకటించింది. తమిళనాడులో హైడ్రోజన్ రిసోర్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ కార్యకలాపాల కోసం తాజాగా రూ. 6,180 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు సోమవారం వెల్లడించింది. ఇదివరకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం వచ్చే పదేళ్ల(2023-2032) కాలంలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులకు ఇది అదనమని పేర్కొంది. తాజా పెట్టుబడులకు సంబంధించి తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్-2024 కార్యక్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు కంపెనీ తెలిపింది. 'ఈ పెట్టుబడి దేశ స్వావలంబనకు, రాష్ట్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కంపెనీ కట్టుబడి ఉందనేందుకు నిదర్శనమని' హ్యూండాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ అన్సూ కిమ్ అన్నారు. అలాగే, హైడ్రోజన్ టెక్నాలజీ వృద్ధికి, గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తుకు ఈ పెట్టుబడులు అవసరమని చెప్పారు.