- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TRAI: ట్రాయ్ కొత్త నిబంధనలతో ఆలస్యం కానున్న ఓటీపీలు
దిశ, బిజినెస్ బ్యూరో: భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ నకిలీ మెసేజ్‌లకు సంబంధించి కొత్త నిబంధలను తీసుకురానుంది. స్పామ్, ఫిషింగ్ మెసేజ్‌లను నియంత్రించేందుకు ట్రాయ్ ఓటీటీ లింక్, యూఆర్ఎల్, ఏపీకేలతో కూడిన మెసేజ్‌లు, వైట్ లిస్ట్‌లో లేని నంబర్ల నుంచి కాల్స్‌ను ఆపేయాలని టెలికాం కంపెనీలకు స్పష్టం చేసింది. అయితే, ఈ కొత్త నిబంధనల వల్ల బ్యాంకులు, ఈ-కామర్స్ కంపెనీల నుంచి వచ్చే ఓటీపీలు ఆలస్యంగా వస్తాయని సమాచారం. ఈ కారణంగా నిబంధనల అమలు కోసం మరింత సమయం కావాలని టెలికాం కంపెనీలు ట్రాయ్‌ను కోరాయి. కానీ, ట్రాయ్ అందుకు నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 31 కంటే ముందు బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు తమ మెసేజ్ టెంప్లేట్‌లు, కంటెంట్‌ను టెలికాం ఆపరేటర్‌ల వద్ద నమోదు చేసుకోవాలి. ఈ నిబంధనలు పాటించడంలో విఫలమైతే, అటువంటి అంశాలతో కూడిన మెసేజ్‌లు బ్లాక్ అవుతాయని ట్రాయ్ పేర్కొంది. గతంలో ఆయా సంస్థలు తమ టెంప్లెట్ మాత్రమే టెలికాం కంపెనీల వద్ద రిజిస్టర్ చేసుకున్నాయి. దానివల్ల మెసేజ్ లోపల కంటెంట్ గురించి సంబంధం లేని మెసేజ్‌లు వచ్చాయి. కానీ, తాజా నిబంధనల వల్ల బ్లాక్ చెయిన్ ఆధారంగా పనిచేసే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ(డీఎల్‌టీ)కి టెలికాం కంపెనీ మారాల్సి ఉంది. దాన్ని బట్టి అన్ని మెసేజ్‌లను వివరాంగా చూడాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా లేకుంటే బ్లాక్ చేయాలి. వీటి అమలు సెప్టెంబర్ 1 నుంచి జరగాల్సి ఉండగా, టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా గడువు పెంపునకు కోరాయి. అయితే, ఇదివరకు పలుమార్లు గడువు ఇచ్చినందున పొడిగింపు కుదరదని వెల్లడించింది.