Aadhaar Card Personal Loan: లోన్ కావాలా? ఆధార్‌ కార్డు చాలు.. రూ.5లక్షల లోన్‌ గ్యారెంటీ..? అర్హతలు, వడ్డీ రేట్లు ఇవే!

by Vennela |   ( Updated:2025-01-17 12:15:31.0  )
Aadhaar Card Personal Loan: లోన్ కావాలా? ఆధార్‌ కార్డు చాలు.. రూ.5లక్షల లోన్‌ గ్యారెంటీ..? అర్హతలు, వడ్డీ రేట్లు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: Aadhaar Card Personal Loan: ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ముందుగా గుర్తుకు వచ్చేది పర్సనల్ లోన్(Personal Loan). వేగంగా లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఇక భారతేదశంలోని పౌరులందరికీ ఆధార్ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్. ఐడెంటిటీ అడ్రస్ ప్రూఫ్(Identity Address Proof) కోసం దీనిని వాడుతుంటాం. అయితే ఆధార్ కార్డుతో పర్సనల్ లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

పర్సనల్ లోన్ అనేది అన్ సెక్యూర్డ్ లోన్ . ఇక్కడ ఎలాంటి హామీ, ష్యూరిటీ అవసరం లేకుండానే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(Non-banking financial companies), పర్సనల్ లోన్స్ అందిస్తుంటాయి. అదేవిధంగా ఆధార్ కార్డు(Aadhaar Card)తో కూడా సులభంగానే లోన్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎక్కువ డాక్యుమెంటేషన్ లేకుండానే సులభంగా డబ్బులు తీసుకోవచ్చు. ఆధార్ కార్డుతో మీ గుర్తింపు తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ అడ్రస్, పర్సనల్ (Personal Loan)ఐడెంటిఫికేషన్, ఇన్ కంప్రూఫ్ వంటివి ప్రత్యేకంగా అవసరం ఉండవు. కాబట్టి ఆధార్ బేస్డ్ లోన్స్ (Aadhaar Based Loans)సాధారణ అప్పుల కంటే వేగంగా లభిస్తాయని చెప్పవచ్చు. అయితే వీటికోసం పూర్తిగా డిజిటల్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఆయా బ్యాంకుల వెబ్ సైట్స్, లేదా యాప్స్ ను చూడవచ్చు. మధ్య వర్తుల జోక్యం ఉండదు. లోన్ అప్రూవల్ కూడా చాలా వేగంగా జరుగుతుంది.

పరిమితి ఆర్థిక పత్రాలు ఉన్నవారు కూడా ఆధార్(Aadhaar Card) నుంచి లోన్స్ తీసుకోవచ్చు. తక్కువ ఆదాయం ఉన్నవారికి కూడా బ్యాంకులు ఈ లోన్స్ మంజూరు చేస్తుంటాయి. అర్హతల విషయానికి వస్తే 21-58ఏళ్ల మధ్య వయస్కులకు సాధారణంగ బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు ఈలోన్స్ మంజూరు చేస్తుంటాయి. కొన్ని సందర్బాల్లో 60-65 ఏళ్ల వారు కూడా లోన్ తీసుకోవచ్చు.

కొన్ని బ్యాంకులు సాధారణంగా లోన్ తీసుకునేవారికి నెలలవారీగా రూ. 15 వేల నుంచి రూ. 25వేల మధ్య ఆదాయం ఉండాలన్న ఖండిషన్స్ పెడుతుంటాయి. అయితే ఎన్బీఎఫ్ సీ(NBFC)ల్లో ఈ విషయంలో కాస్త వెలుసుబాటు ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోర్(Credit Score) 700 ఉంటే లోన్ తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. వడ్డీ రేట్లలో రాయితీ కూడా పొందవచ్చు. ఉద్యోగం చేస్తున్నవారు లేదా స్వయం ఉపాధి పొందుతూ స్థిర ఆదాయం పొందుతున్నవారికి బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు ఈలోన్స్ అందిస్తాయి.

తమ గుర్తింపు ధ్రువీకరణ కోసం దరఖాస్తుదారులు ఆధార్ కార్డు(Aadhaar Card) , డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, ఓటర్ ఐడీ, పాన్ కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించాల్సి ఉంటుంది. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఆఫీస్ అడ్రెస్ వెరిఫికేషన్ కోసం జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. వ్యాపారులు ఆదాయ ధ్రువీకరణ కోసం బ్యాలెన్స్ షీట్, లాభనష్టాల పట్టిక , బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్ ఇవ్వాలి. ఉద్యోగులు అయితే ఫారం 16,శాలరీ స్లిప్స్, ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి.

లోన్ కోసం ముందుగా ఆధార్ పర్సనల్ (Personal Loan)లోన్స్ అందిస్తున్న బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ (NBFC)వెబ్ సైట్ లేదా యాప్ లోకి వెళ్లాలి. అడిగిన పత్రాలను అప్ లోడ్ చేయాలి. ఓటీపీతో మీ కేవైసీ పూర్తి చేయాలి. అన్ని పత్రాలు అప్ లోడ్ చేసి సబ్‌మిట్ చేసిన తర్వాత 24 నుంచి 48 గంటల్లోకా మీ లోన్ అప్లికేషన్ ఆమోదం పొంది అకౌంట్లో నగదు జమ అవుతుంది.

ఇక కొన్ని బ్యాంకులు కనీసం రూ. 50వేల నుంచి గరిష్టంగా రూ. 5లక్షల వరకు ఇలా ఆధార్ తో పర్సనల్ లోన్స్(Personal Loans with Aadhaar) ఇస్తున్నాయి. ఇదే ఎన్పీఎఫ్సీ(NBFC)లు అయితే రూ. 25వేల నుంచి కూడా అప్పులు ఇస్తున్నాయి. సదరు బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి కాస్త ఎక్కువ మొత్తం ఇస్తుంది. వడ్డీ రేట్లు పర్సనల్ లోన్స్(Personal Loan) పై సాధారణంగానే ఎక్కువగా ఉంటాయి. ప్రారంభంలోనే 12.7శాతం ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 5శాతం ఉంటుంది. తిరిగి చెల్లించేందుకు ఏడాది నుంచి 5ఏళ్ల టెన్యూర్ ఎంచుకోవచ్చు. వీలైనంత వరకు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు, ఇతర ఛార్జీలు పోల్చుకుని మీరు లోన్ తీసుకోవడం బెటర్.



Next Story

Most Viewed