UPI Daily limit: UPI లావాదేవీలపై రోజు వారి లిమిట్.. ఏ బ్యాంకుల్లో ఎంతో తెలుసుకోండి..

by Harish |
UPI Daily limit: UPI లావాదేవీలపై రోజు వారి లిమిట్.. ఏ బ్యాంకుల్లో ఎంతో తెలుసుకోండి..
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. ప్రధాన నగరాల నుంచి మొదలుకుని మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 2016లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ని ప్రవేశపెట్టినప్పటి నుంచి దాని ద్వారా జరిగే లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది.

అయితే సాధారణంగా UPI ద్వారా గరిష్ట రోజువారీ లావాదేవీ పరిమితిని రూ. 1 లక్షగా నిర్ణయించింది. దీంతో బ్యాంకులు కూడా NPCI నిబంధనలకు అనుగుణంగా తమ రోజువారీ UPI లావాదేవీల పరిమితులను రూ. 1 లక్షగా నిర్ణయించాయి. అయితే వీటిలో కొన్ని పరిమితులు ఉన్నాయి. UPI ద్వారా ఒక రోజు చెల్లింపులు చేయడానికి ఏ బ్యాంకుల్లో ఎంత పరిమితి ఉందో తెలుసుకోండి..

1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: రోజువారీ UPI లావాదేవీ పరిమితి రూ.1,00,000. 24 గంటల్లో రోజుకు 10 లావాదేవీలకు పరిమితం.

2. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: UPI ద్వారా గరిష్ట లావాదేవీ మొత్తం రూ. 1 లక్ష.

3. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోజువారీ UPI లావాదేవీ పరిమితి రూ. 1 లక్ష.

4. పంజాబ్ నేషనల్ బ్యాంక్: UPI లావాదేవీ గరిష్ట పరిమితి రూ. 1 లక్ష.

5. Axis బ్యాంక్: 24 గంటల్లో UPI ద్వారా డెబిట్ ఫండ్ బదిలీలు/వ్యక్తిగత చెల్లింపుల పరిమితి రూ. 1 లక్ష.

6. HDFC బ్యాంక్: 24 గంటల్లో ఒక్కో బ్యాంక్ ఖాతాకు 20 లావాదేవీలకు గరిష్టంగా రూ. 1 లక్ష పరిమితి

7. ICICI బ్యాంక్: 24 గంటల్లో గరిష్టంగా 10 లావాదేవీలు. రూ. 1 లక్ష పరిమితి.

8. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌: ఒక రోజులో 10 లావాదేవీలు. గరిష్ఠంగా రూ.లక్ష వరకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

9. UCO బ్యాంక్: వినియోగదారులు రోజుకు మొత్తం రూ. 1,00,000 పంపవచ్చు.

10. IDBI బ్యాంక్: బ్యాంక్ UPI రోజు లావాదేవీ పరిమితిని రూ. 1,00,000 గా నిర్ణయించింది.

Advertisement

Next Story

Most Viewed