HDFC: హెచ్‌డీఎఫ్‌సీ నుంచి మరో మ్యూచువల్ ఫండ్..జనవరి 31 నుంచే షురూ.. రూ.100 ఉంటే చాలు

by Vennela |
HDFC: హెచ్‌డీఎఫ్‌సీ నుంచి మరో మ్యూచువల్ ఫండ్..జనవరి 31 నుంచే షురూ.. రూ.100 ఉంటే చాలు
X

దిశ, వెబ్ డెస్క్: HDFC Mutual Fund: ఈక్విటీ ఇన్వెస్టర్లకు మరో కొత్త స్కీము త్వరలోనే అందుబాటులోకి వస్తోంది. హెచ్ డీఎఫ్ సీ మ్యూచువల్ ఫండ్(HDFC Mutual Fund) ఈ జనవరి 31వ తేదీన కొత్త ఇండెక్స్ ఫండ్ సబ్ స్క్రిప్షన్ తీసుకొస్తుంది. దీనిలో కనీస పెట్టుబడి రూ. 100 నుంచి మొదలవుతుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

HDFC Mutual Fund: మీరు మ్యూచువల్ ఫండ్స్ (HDFC Mutual Fund)లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీకో మంచి ఆప్షన్ ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన అసెట్ మేనేజ్ మెంట్ సంస్థ హెచ్ డీఎఫ్ సీ మ్యూచువల్ ఫండ్స్ మరో కొత్త ఫండ్ ను తీసుకొస్తోంది. అదే హెచ్ డీఎఫ్ సీ నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ ఫండ్. ఈ కొత్త ఫండ్ ఆఫర్ సబ్ స్క్రిప్షన్ జనవరి 31వ తేదీ నుంచి షురూ కాబోతోంది. ఈ నెల తొలినాళ్లలోనే సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

హెచ్డీఎఫ్సీ నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ ఫండ్ అనేది ఒక ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఈ స్కీమ్ బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ టీఆర్ఐ ఉంటుంది. 3ఏళ్లు ఆపైన దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టేవారికి ఇది సరైన ఎంపిక అని ఏఎంసీ తెలిపింది. అయితే ఇందులో చాలా రిస్క్ ఉంటుందని తెలిపింది. ఈ స్కీమ్ సబ్ స్క్రిప్షన్ జనవరి 31, 2025న మొదలై ఫిబ్రవరి 14,2025 వరకు కొనసాగనుంది. ఈ స్కీమ్ ఫండ్ మేనేజర్లుగా నిర్మాన్ ఎస్ మొరాఖియా, అరుణ్ అగర్వాల్ ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్కీమ్ తమకు అనువైనదేనా అని తెలుసుకునేందుకు ఫైనాన్షియల్ అడ్వైజర్ ను కలవాలని పేర్కొంది.

ఇక సబ్ స్క్రిప్షన్ ముగిసిన తర్వాత వారంలో యూనిట్ల కేటాయింపు అనేది ఉంటుంది. ఆ తర్వాత యూనిట్ల కేటాయింపు ముగుస్తుంది. ఐదు పని దినాల్లో ఈ స్కీము యూనిట్లు క్రయవిక్రయాలకు రిటైల్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని హెచ్డీఎఫ్సీ ఏఎంసీ తెలిపింది. నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ పనితీరు ఆధారంగా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ జనరేట్ చేయాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఓపెన్ ఎండెడ్ స్కీమ్ కావడంతో యూనిట్లు విక్రయించుకోవచ్చు. లేదా రెడీమ్ కూడా చేసుకోవచ్చు. దీనిలో రెగ్యులర్ డైరెక్ట్ అని రెండు రకాల ప్లాన్స్ ఉంటాయి. కొత్త ఫండ్ ఆఫర్ సమయంలో ఆ తర్వాత కూడా ఇందులో కనీస పెట్టుబడి రూ. 100గా ఉంటుంది. ఆ తర్వాత రూ. 100 చొప్పున ఎంతైన పెట్టుబడి పెట్టుకోవచ్చు.

ఈ ఆర్టికల్ కేవలం సమాచారం కోసమే అందించినదని గుర్తించుకోండి. ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించడం లేదు. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి అనేది చాలా రిస్క్ తో కూడుకున్నది. సరైన అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టకూడదు.



Next Story

Most Viewed