- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Harsh Goenka: భార్యల తెలివితేటలపై హర్ష్ గోయెంకా ఆసక్తికరమైన పోస్టు.. ఇప్పటికైనా భార్యల మాట వినండి!

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. తన అభిప్రాయాలను, స్ఫూర్తినిచ్చే ఫొటోలు, వీడియోలను తన ఫాలోవర్లతో పంచుకుంటారు. ఇక తాజాగా ఆయన ఎక్స్ ఖాతాలో భార్యల తెలివితేటలను ప్రశంసిస్తూ హాస్యాస్పదంగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుతం దేశంలో బంగారం (Gold) ధరలు ఆకాశానికి పరుగులు పెడుతున్నాయి. దీంతో ఎక్కడ విన్నా పెరుగుతున్న బంగారం గురించే చర్చ నడుస్తోంది. అయితే, ఈ విషయాన్ని భారతీయ గృహిణులు ఎప్పుడో కనిపెట్టారని, వారే నిజమైన ఆర్థిక వేత్తలు అని హర్ష్ గోయెంకా ప్రశంసించారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంలోని పలు సందర్భాలను ఆయన ఉదాహరణలుగా పంచుకున్నారు. పదేళ్ల క్రితం ఆయన రూ.8 లక్షలు పెట్టి కారు కొనుగోలు చేయగా, ఆయన భార్య బంగారం కొనుగోలు చేసినట్లు చెప్పారు. అయితే, ఇప్పుడు ఆ కారు విలువ రూ.1.25 లక్షలకు పడిపోగా.. బంగారం విలువ రూ.32 లక్షలుకు పెరిగినట్లు తెలిపారు.
అలాగే, మరో సందర్భంలో బంగారం వద్దు వెకేషన్‌కి వెళ్ధామని అడిగితే.. వెకేషన్ 5 రోజులే ఉంటుందని, బంగారం ఐదు తరాలు ఉంటుందని చెప్పినట్లు పేర్కొన్నారు. మరోసారి తాను లక్ష పెట్టి మొబైల్ ఫోన్ కొంటే, ఆమె బంగారం కొనుకున్నదని, వాటిలో ఫోన్ విలువ ఇప్పుడు రూ.8 వేలకు పడిపోగా, బంగారం విలువ రూ.2 లక్షలకు పెరిగిందన్నారు. చివరగా ఇందులో తెలుసుకోవల్సిన నీతి ఏంటంటే.. భార్యలు తెలివైన వారు అంటూ చమత్కారమైన పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఇప్పటికైనా భార్యల మాట వినాలంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.