ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతం

by S Gopi |
ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో కీలక ఎనిమిది మౌలిక రంగాల వృద్ధి ఫిబ్రవరిలో 6.7 శాతం పెరిగిందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటనలో తెలిపింది. అంతకుముందు జనవరిలో 4.1 శాతం, 2023, డిసెంబర్‌లో 4.9 శాతం పెరుగుదల నమోదైన తర్వాత ఇది గణనీయంగా వృద్ధి అని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, గతేడాది ఫిబ్రవరిలో నమోదైన 7.4 శాతంతో పోలిస్తే కొంచెం తగ్గింది. సమీక్షించిన నెలలో ప్రధాన బొగ్గు, సహజవాయువు, సిమెంట్, ఉక్కు, ముడి చమురు, విద్యుత్, రిఫైనరీ ఉత్పత్తులు సానుకూలంగా వృద్ధిని నమోదు చేశాయి. బొగ్గు గతేడాది 9 శాతం నుంచి 11.6 శాతం పెరిగింది. ముడి చమురు ఉత్పత్తి గతేడాది ఫిబ్రవరిలో 4.9 శాతం క్షీణించగా, ఈసారి 7.9 శాతం పెరిగింది. సహజ వాయువు 11.3 శాతం, రిఫైనారీ ఉత్పత్తులు 2.6 శాతం, ఉక్కు 8.4 శాతం, విద్యుదుత్పత్తి 6.3 శాతం, సిమెంట్ 10.2 శాతం ఎక్కువ ఉత్పత్తిని సాధించాయి. ఎరువుల రంగం మాత్రమే 9.5 శాతం క్షీణతను నమోదు చేసింది.

Advertisement

Next Story