- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కోల్ ఇండియాలో 3 శాతం వాటా విక్రయించనున్న ప్రభుత్వం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కోల్ ఇండియాలో 3 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. జూన్ 1 నుంచి ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయం చేపట్టాలని తెలిపింది. జూ 1-2వ తేదీల్లో రిటైల్ నాన్-రిటైల్ మదుపర్ల కోసం ఈ ఆఫర్ ఫర్ సేల్ ప్రారంభించనున్నట్టు పేర్కొంది. మొదట కంపెనీలో 1.5 శాతం వాటాకు సమానమైన 9.24 కోట్ల షేర్లను విక్రయించిన తర్వాత ఓవర్ సబ్‌స్క్రిప్షన్ అయిన నేపథ్యంలో మరో 1.5 శాతం వాటాను విక్రయించేందుకు వీలుంటుందని ప్రభుత్వ వివరించింది. రూ. 10 ముఖ విలువ కలిగిన 9.24 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.
బుధవారం నాటికి కంపెనీ షేర్ ధర రూ. 241.20 వద్ద ముగిసింది. ఈ వాటా విక్రయం ద్వారా సుమారు రూ. 4,400 కోట్లను సేకరించవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వాటా విక్రయంపై ఇన్వెస్టర్ల ఆసక్తిని తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే రోడ్‌షోలను చేపట్టినట్టు సమాచారం. అయితే, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి కోల్ ఇండియా షేర్ ధర 7.45 శాతం, గడిచిన ఏడాది కాలంలో 23.18 శాతం పుంజుకుంది.