PSUs: ప్రభుత్వ సంస్థల కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ గడువును పొడిగించిన కేంద్రం

by S Gopi |
PSUs: ప్రభుత్వ సంస్థల కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ గడువును పొడిగించిన కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు(సీపీఎస్ఈ) సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ఈలు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ గడువును 2026, ఆగష్టు వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మినహాయింపును ఇస్తూ, సీపీఎస్ఈలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను 25 శాతానికి పెంచేందుకు 2026, ఆగష్టు 1 వరకు అనుమతిచ్చింది. దీనికి సంబంధించి తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ మెమోరాండం విడుదల చేసింది. సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ (రెగ్యులేషన్) రూల్స్ 1957 ప్రకారం, ఐదు శాతం కంటే తక్కువ ఉన్న సంస్థ తమ పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను కనీసం 25 శాతానికి పెంచడానికి తాజా గడువును 2026, ఆగష్టు వరకు మినహాయింపు ఉంటుందని మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు సెబీ పబ్లిక్ షేర్‌హోల్డింగ్ ప్రమాణాల కంటే తక్కువగా వాటాను కలిగి ఉన్నాయి.

Advertisement

Next Story