- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Prayagraj: ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే విమాన టికెట్ ధరలు తగ్గించాలని కోరిన ప్రభుత్వం

దిశ, బిజినెస్ బ్యూరో: మహా కుంభమేళా కారణంగా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. కుంభ మేళాకు వెళ్లే ప్రయాణీకులు పెరగడంతో డిమాండ్ అత్యధికంగా ఉంది. దీనిపై ఆందోళనలు పెరగడంతో పౌర విమానయాన శాఖ బుధవారం టికెట్ ధరల విషయంలో సానుకూలంగా ఉండాలని విమానయాన సంస్థలను కోరింది. ఇదే అంశానికి సంబంధించి వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ.. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే విమాన ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ధరలను తగ్గించేందుకు డీజీసీఏ చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు, సెక్రటరీ వి వాల్నమ్, డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్, సీనియర్ అధికారులు ప్రయాగ్‌రాజ్ విమానాల గురించి ఎయిర్‌లైన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లే వారికోసం సహేతుకమైన ఛార్జీలను అమలు చేస్తూ, ప్రయాగ్‌రాజ్‌కి అవసరమైన విమాన కనెక్టివిటీని పెంచే చర్యలపై చర్చించారు. ఈ క్రమంలోనే దేశీయ అతిపెద్ద క్యారియర్ ఇండిగో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే విమాన ఛార్జీలను 30-50 శాతం మధ్య తగ్గించింది. దీనిపై ఇండిగోను సంప్రదించగా స్పందించలేదు.