Gold: వామ్మో..ఇండియాలోని ఈ ప్రాంతంలో ఇన్ని బంగారం నిల్వలా? పంట పండిందిగా.. ఎక్కడంటే?

by Vennela |
Gold: వామ్మో..ఇండియాలోని ఈ ప్రాంతంలో ఇన్ని బంగారం నిల్వలా? పంట పండిందిగా.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: Gold Reserves in India: చాలా మంది డబ్బును పొదుపు చేసేందుకు, పెట్టుబడి పెట్టడానికి బంగారం బెస్ట్ ఛాయిస్ అని చెబుతుంటారు. బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడంతా బంగారందే భవిష్యత్తు.

ప్రపంచ వ్యాప్తంగా బంగారాన్ని(Gold Reserves in India) వాడుతున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ధరలు కూడా తరుచుగా మారుతుంటాయి. దీనికి భారతదేశం మినహాయింపు ఏమీ కాదు. నేటి కాలంలో ప్రజలు మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ..పురాతన కాలంగా నుంచి బంగారం పెట్టుబడికి ఉత్తమ సాధనంగానే పరిగణిస్తున్నారు. బంగారం ధరలు(gold rates) కూడా భారీగా పెరుగుతుండటంతో చాలా మంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో బంగారం అమెరికా దగ్గర ఉంది. బంగారం నిల్వలు ఉన్న దేశాల జాబితాలో అమెరికా మొదటిస్థానంలో ఉంది. అమెరికా దగ్గర 8,133 టన్నుల బంగారం ఉంది. ఈ బంగారం ధర దాదాపు 543,499.37 మిలియన్ డాలర్లు అంటే రూ. 45 లక్షల కోట్ల కంటే ఎక్కువే అని చెప్పవచ్చు. అయితే అమెరికా తర్వాత అత్యధిక బంగారం చైనా, భారత్ లో ఉంది.

భారత్ లో బంగారం వనరుల్లో అత్యధికంగా 44శాతం బీహార్ లో ఉంది. బీహార్ తర్వాత రాజస్థాన్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. అయితే దేశంలో అత్యధికంగా బంగారాన్ని వెలికితేసే ఏకైక బంగారు గని కర్నటకలోని హట్టి గోల్డ్ మైన్స్(Hattie Gold Mines). ఈ గనులు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. అయితే దేశంలోని 80శాతం బంగారం కర్నాటక రాష్ట్రం నుంచే వస్తుంది. ఈ కారణంగానే దేశంలోనే అత్యధికంగా బంగారం నిల్వులున్న రాష్ట్రంగా కర్నాటక గుర్తింపు పొందింది.

బంగారం గనులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్నాటక(Karnataka) అయితే బంగారం తక్కువ ధరకు లభ్యం అయ్యే రాష్ట్రం కేరళ. భారత్ లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో బంగారం ధర తక్కువగా ఉంటుంది. ఈ ధరల్లో తేడాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. ప్రధానంగా చిన్న, పెద్ద పోర్టులు ఎక్కువగా ఉండటం ఒక్కటైతే..కేరళలో రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు తక్కువగా ఉండటం మరో కారణంగా చెప్పవచ్చు. దీంతో బంగారం ధర తగ్గుతుంది.

మరో ముఖ్య విషయం ఏంటంటే కేరళలోని కొంతమంది వ్యాపారులు జీఎస్టీ(gst) నిబంధనలు తప్పించుకుంటున్నారని..అందుకే తక్కువ ధరకు బంగారాన్ని ఇచ్చేందుకు సహాయపడుతున్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఇది ఫైనాన్షియల్ క్రైమ్ అయినప్పటికీ ఆ రాష్ట్రంలో చాపకింద నీరులా ఈ వ్యవహారం సాగిపోతోంది. అందుకే కేరళ రాష్ట్రంలో తక్కువ రేటుకు బంగారం దొరుకుతోంది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed