విమాన సర్వీసుల రద్దును పొడిగించిన గోఫస్ట్!

by Vinod kumar |
విమాన సర్వీసుల రద్దును పొడిగించిన గోఫస్ట్!
X

న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో ఉన్న విమానాయన సంస్థ గోఫస్ట్ కార్యకలాపాల నిర్వహణ కారణాలతో తన అన్ని విమానాల సర్వీసులను ఈ నెలాఖరు వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది మేలో స్వచ్ఛందంగా దివాలా పిటిషన్ దాఖలు చేసిన కంపెనీ, పలు దశల్లో విమానా సేవలను రద్దు చేస్తూ వచ్చింది. తాజాగా ఆగష్టు 27 వరకు రద్దును కొనసాగించిన గోఫస్ట్ మరోసారి దీన్ని పొడిగించింది. కార్యకలాపాల్లో సమస్యల వల్లనే రద్దును పొడిగించామని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని కంపెనీ ఎక్స్(ట్విటర్) ద్వారా వెల్లడించింది.

తక్షణ పరిష్కారం, కార్యకలాపాల పునరుద్ధరణ కోసం పిటిషన్‌ను దాఖలు చేశామని, త్వరలో బుకింగ్‌లను పునఃప్రారంభించడంపై ఆశాజనకంగా ఉన్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే గోఫస్ట్ సంస్థపై విమానాల లీజింగ్ కంపెనీ ఏసీజీ ఎయిర్‌క్రాఫ్ట్ తమ లీజింగ్ విమానాల్లోని విడిభాగాల అదృశ్యంపై కోర్టు దృష్టి తీసుకెళ్లింది. అదృశ్యమైన వాటిలో ఇంజిన్ ఫ్యాన్ బ్లేడ్లు, పైలట్ సైడ్ స్టిక్ వంటి విడిభాగాలు ఉన్నాయని సమాచారం.

Advertisement

Next Story