- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Adani: అత్యంత సన్నిహితుల మధ్య గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ వివాహ వేడుక

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ శుక్రవారం వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సూరత్ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా షాను జీత్ పెళ్లి చేసుకున్నారు. అహ్మదాబాద్‌లో అత్యంత సన్నిహిత బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో గుజరాతీ సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుక జరిగింది. ఈ విషయాన్ని గౌతమ్ అదానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. సంప్రదాయ పద్ధతిలో, ఆత్మీయుల మధ్య వివాహం జరిగిందంటూ ఫోటోలను కూడా షేర్ చేశారు. చాలా చిన్నగా, ప్రైవేట్ ఫంక్షన్‌గా తక్కువ మంది బంధుమిత్రుల మధ్య జరిగిన ఈ వివాహానికి అందరినీ ఆహ్వానించనందుకు క్షమించాలని కోరారు. కొత్త జంటను మీ అందరి నుంచి ఆశీస్సులు, ప్రేమను ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పారు. జీత్ అదానీకి దివా షాతో 2023, మార్చి 12న అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని 'శాంతిగ్రామ్' అనే అదానీ టౌన్‌షిప్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వారి వివాహ వేడుక మొదలైంది. సాంప్రదాయ జైన, గుజరాతీ సంస్కృతిలో జరిగాయి. కుమారుడి వివాహ వేడుక సందర్భంగా గౌతమ్ అదానీ సామాజిక ప్రయోజనాల కోసం రూ. 10,000 కోట్ల విరాళం ఇవ్వడం విశేషం. ఈ నిధులను హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్‌లో మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు వినియోగించనున్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి ఉపాధి కల్పించే లక్ష్యంతో సరసమైన ప్రపంచ స్థాయి ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, కె-12 పాఠశాలలు, గ్లోబల్ స్కిల్ అకాడమీలను స్థాపించడానికి ఈ నిధులను వినియోగించాలని భావిస్తున్నారు.