పునరుత్పాదక సామర్థ్యంపై అదానీ రూ.2.3 లక్షల కోట్లు పెట్టుబడులు

by S Gopi |
పునరుత్పాదక సామర్థ్యంపై అదానీ రూ.2.3 లక్షల కోట్లు పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బిలీయనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ 2030 నాటికి పునరుత్పాదక ఇంధన విస్తరణ, సౌర, పవన విద్యుత్ సామర్థ్యం కోసం రూ. 2.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దేశంలోని అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, గుజరాత్ కచ్‌లో ఖావ్‌డా వద్ద సౌర, పవన విద్యుదుత్పత్తిని ప్రస్తుత 2గిగావాట్ల నుంచి 30 గిగావాట్లకు పెంచేందుకు సుమారు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు, దేశీయంగా 6-7 గిగావాట్ల ప్రాజెక్టుల కోసం మరో రూ. 50,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు కంపెనీ ఉన్నతాధికారి పేర్కొన్నారు. గుజరాత్‌లోని ముంద్రా వద్ద సౌర సెల్ అండ్ విండ్ టర్బైన్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించడం కోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ. 30,000 కోట్ల వరకు పెట్టుబడులు పెడుతుందని అధికారి వివరించారు. ప్రస్తుత 10,934 మెగావాట్ల పోర్ట్‌ఫోలియోను 2030 నాటికి మూడు రెట్లు పెంచే లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎజెల్ వినీత్ ఎస్ జైన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఖావ్‌డా వద్ద 2000 మెగావాట్ల సామర్థ్యం ఉంది, ఏటా 4 గిగావాట్లా సామర్థ్యాన్ని చేర్చుకోవాలని వినీత్ జైన్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed