లంచం కేసులో 'గెయిల్' డైరెక్టర్ రంగనాథన్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ..

by Disha News Web Desk |
లంచం కేసులో గెయిల్ డైరెక్టర్ రంగనాథన్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ గ్యాస్ కార్పొరేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) డైరెక్టర్(మార్కెటింగ్) ఈఎస్ రంగనాథన్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్(సీబీఐ) ఆదివారం అరెస్ట్ చేసింది. గెయిల్ ద్వారా విక్రయించే పెట్రో కెమికల్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న ప్రైవేట్ కంపెనీలకు రాయితీల విషయంలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. రంగనాథన్‌తో పాటు ఐదుగురు ప్రైవేట్ వ్యక్తులను సీబీఐ అరెస్టు చేసింది. పెట్రో కెమికల్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న ప్రైవేట్ కంపెనీల నుంచి రూ. 50 లక్షలకు పైగా లంచం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న భికాజీ కామా ప్లేస్‌లో ఉన్న రంగనాథన్ ఆఫీస్, నోయిడాలోని సెక్టార్ 62లో ఉన్న ఆయన నివాసంతో పాటు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని 8 ప్రదేశాల్లో సెంట్రల్ ఏజెన్సీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ. 1.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు, ఇంకా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సీబీఐ అరెస్ట్ చేసిన వారిలో రంగనాథన్‌తో పాటు మధ్యవర్తులుగా ఉన్న పవన్ గౌర్, రాజేష్ కుమార్, ఎన్ రామకృష్ణన్ నాయర్‌, వ్యాపారవేత్త సౌరభ్ గుప్తా, ఆదిత్య బన్సాల్ ఉన్నారు.




Advertisement

Next Story