BSNL: బీఎస్ఎన్ఎల్ కు మంచి రోజులు..17ఏళ్ల తర్వాత లాభాల్లోకి.. వందల కోట్లు ప్రాఫిట్

by Vennela |
BSNL: బీఎస్ఎన్ఎల్ కు మంచి రోజులు..17ఏళ్ల తర్వాత లాభాల్లోకి.. వందల కోట్లు ప్రాఫిట్
X

దిశ, వెబ్ డెస్క్ : BSNL Makes Profitability: ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఏకంగా 17ఏళ్ల తర్వాత లాభాలబాట పట్టింది. ఈ సమయంలో వందల కోట్ల మేర లాభాలను నమోదు చేసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బీఎస్ఎన్ఎల్(BSNL) పని ఖతమ్ అనుకున్నవారికి దిమ్మతిరిగే ఫలితాలను ఇచ్చింది. నెట్ వర్క్ పరంగా కాస్త వెనకంజలో ఉన్నా లాభాల్లో మాత్రం దూసుకుపోయింది. మిగతా ప్రైవేట్ టెలికాం కంపెనీలు రియలన్స్ జియో(jio), భారతీ ఎయిర్ టెల్(airtel), వొడాఫోన్ ఐడియా(vi) వంటివి ఇప్పటికే 5జీ రంగంలో విజయవంతమై 6జీ దిశగా దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ (BSNL)తమ యూజర్లకు 4జీ(4g) ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ టెలికాం సంస్థకు గత కొన్నేళ్లుగా లాభాలు లేవు. ప్రతి ఆర్థిక సంవత్సరం మూడు నెలలకు ఓసారి ప్రకటించే త్రైమాసిక ఫలితాల్లో ఎప్పుడూ నష్టాలే ప్రకటించింది. కానీ ఎట్టకేలకు దాదాపు 17ఏళ్ల తర్వాత ఈ దిగ్గజ కంపెనీ ఇప్పుడు తిరిగి లాభాల్లోకి వచ్చింది.

ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్(BSNL రూ. 262కోట్ల లాభాన్ని నమోదు చేసింది. చివరిసారి ఈ సంస్థ 2007లోనే త్రైమాసిక లాభాలను నమోదు చేసింది. సంస్థ ఫలితాల నేపథ్యంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Union Minister Jyotiraditya Scindia) కీలక వ్యాఖ్యలు చేశారు. సేవలు, వినియోగదారుల విస్తరణపై ఫోకస్ పెడుతూ వచ్చిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఈ పరిణామం మేలుమలుపు వంటిందన్నారు.

పలు కీలక అంశాల్లో బీఎస్ఎన్ఎల్ (BSNL) చాలా వరకు పుంజుకుంది. లీజ్డ్ లైన్, ఎఫ్టీటీహెచ్, మొబిలిటీ సేవ(mobility services)ల్లో 14-18 శాతం వృద్ధి నమోదు చేసింది. గత జూన్ నెలలో 8.4 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. డిసెంబర్ వరకు చూస్తే 9కోట్లకు పైగా పెరిగారు. బీఎస్ఎన్ఎల్ (BSNL)సహా భారత్ లో టెలికాం ప్రయాణానికి ఈ రోజు ముఖ్యమైందని సింధియా పేర్కొన్నారు.

ఇక గత నాలుగు సంవత్సరాల్లో చూస్తే బీఎస్ఎన్ఎల్(BSNL) ఎబిటా రూ. 110కోట్ల నుంచి రెట్టింపై 2023-24 కల్ల రూ. 2100 కోట్లకు పెరిగింది. దేశవ్యాప్తంగా 4జీ సేవలకు లక్ష టవర్లలో 75వేల టవర్స్ ఇస్టాలేషన్ పూర్తి అయ్యింది. దీంతో 60వేల వరకు సేవలను ప్రారంభించాయి. జూన్ వరకల్లా ఈ టవర్లు కార్యకలాపాలు ప్రారంభిస్తాయని తెలిపారు. ముఖ్యంగా గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత చూస్తే ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్స్ భారీగా పెంచింది. బీఎస్ఎన్ఎల్(BSNL) మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్న బీఎస్ఎన్ఎల్ వైపు జనం మొగ్గుచూపారు. ఈ సమయంలో ఇతర టెలికాం కంపెనీల్లో సబ్ స్క్రైబర్స్ సంఖ్య తగ్గింది. దీనిలో వరుసగా కొన్ని నెలల్లో చందాదారులు కూడా పెరిగారు. ఇదే లాభాలకు కారణం అయినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

Next Story

Most Viewed