- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Freshers Hiring: ఫిబ్రవరిలో 6 శాతం పెరిగిన ఫ్రెషర్ల నియామకాలు

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో నియామకాలు సానుకూలంగా జరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా వివిధ కారణాలతో బలహీనంగా ఉన్న హైరింగ్ ప్రక్రియ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ప్రముఖ జాబ్స్ ప్లాట్‌ఫామ్ ఫౌండ్ఇట్ తాజాగా సేకరించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి భారత జాబ్ మార్కెట్లో ఫ్రెషర్ల హైరింగ్ ప్రక్రియ నెలావారీగా 6 శాతం పుంజుకుంది. మొత్తం నియామకాలు కూడా 10 శాతం మేర పెరగడం విశేషం. అత్యధికంగా ఐటీ(హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్) రంగంలో ఫ్రెషర్ల నియామకాలు ఏకంగా 34 శాతం నమోదవడం గమనార్హం. గతేడాది ఇదే నెలలో 17 శాతం ఫ్రెషర్ల హైరింగ్ జరిగింది. దీని తర్వాత రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ సంస్థలో ఫ్రెషర్ల నియామకాలు 8 శాతం పెరగ్గా, ఎడ్యుకేషన్, ఎడ్‌టెక్ రంగాల్లో 6 శాతం ఎక్కువగా జరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ)ల్లో 7 శాతం ఫ్రెషర్ల నియామకం జరిగినప్పటికీ, గతేడాది కంటే 9 శాతం క్షీణించింది. అలాగే, బీపీఓ రంగంలో కూడా ఫ్రెషర్ల నియామకాలు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో ఫ్రెషర్ల నియామకంతో పాటు వారికి ఎక్కువ జీతానికి తీసుకున్న రంగాల్లో యానిమేషన్ అండ్ గేమింగ్ 15 శాతం, హెల్త్‌కేర్, రిటైల్ రంగాలు 8 శాతం చొప్పున ఎక్కువ ఆఫర్ చేశాయి.